Pawan Sends Mangoes to Nithiin

Nithin got mangoes from powan kalyan

nithin got mangoes from powan kalyan, hero nithin, tollywood hero power star pawan kalyan, pawan sends maogoes to nithin, pavan kalyan mongo garden, power mangoes, Actor-politician Pawan Kalyan

Actor-politician Pawan Kalyan has sent mangoes to his fan, actor Nithiin. Just like every year, Pawan followed the same tradition and sent the mangoes grown in his farm to his near and dear ones.

ఔను.. మీరు ఊహించింది నిజమే.. ఆ మామిళ్లు పవన్ కల్యాన్ పంపించినవే..

Posted: 06/13/2015 08:29 PM IST
Nithin got mangoes from powan kalyan

టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ గత కొన్నేళ్లుగా తన మనస్సును ప్రతి వేసవిలో పంచుతున్నారు. అదేంటి పవర్ స్టార్ తన మనస్సును పంచడమేంటని అలోచనలో పడ్డారా..? అదేనండి పవన్ కల్యాన్ తన తోటలో మనస్సు పెట్టి పండించే మామిడి పళ్ల గురించే మేము మాట్లాడుతున్నాం. ఆ మామిడి పళ్లు కూడా ఆయన మనస్సులా తీయగా వుంటాయి. మీకు తెలుసా..? అమృతాన్ని తనలో దాచుకుని వందల రకాలలోని మామిళ్లకు తాము చాలా దూరంమంటూ కాలర్ ఎగురవేసుకునే ఈ మామిడి పండ్ల రుచి గురించి ఎవరిని అడుగుతాం..?

ఇంకెవరిని అడుగుదాం. పవన్ కల్యాన్ అభిమాని, హీరో నితిన్ ను అడుగుదాం. ఎందుకంటే గత రెండుమూడేళ్ల నుంచి పవన్ కల్యాన్ నుంచి పార్శిల్ అందుకుంటున్న కొంతమందిలో ఆయన ఓకరు కాబట్టి. మళ్లీ పార్శిల్ అంటారేమిటా అనుకుంటున్నారా.. అదే మామిడిపళ్ల బుట్ట. పవన్ కల్యాణ్‌ ప్రతీ వేసవిలో తన తోటలో పండించిన తాజా మామిడి పళ్లను ఆప్తులకు పంపిస్తుంటారు. ప్రతి ఏడాదీ ఈ పళ్లు అందుకుంటున్నవారిలో నితిన్ కూడా ఉన్నారు. గత ఏడాది ఈ పార్శిల్ రాగానే ఆనందం పట్టలేక, కెవ్వు కేక పెట్టినంత పని చేశార హీరో నితిన్. అయితే ఈ సంవత్సరం కూడా అనుకున్నట్టుగానే తనకు మామిడి పళ్ల పార్శిల్ రావడంతో..పవన్ తనకి పంపిన పళ్లబుట్టని ఫోటో తీసి ట్విట్టర్ లో ట్విట్ చేసి...అవును 99 శాతం మీరందరూ ఊహించింది కరక్టే...పవర్ స్టార్ నుంచే వచ్చాయి...అని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక దాని మధురం గురించి అతడ్ని అడిగితే వాటిని వివరించలేం.. కేవలం ఆస్వాధించడం తప్ప అంటారేమో..

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nithin  powankalyan  mangoes  

Other Articles