passenger spots lizard in flight meal air india says absolutely no truth in claim

Lizard in ai food tray story false fabricated minister

Air India, Lizard in AI food tray, Civil Aviation Minister Ashok Gajapathi Raju, hoax, London, AI-111, a Boeing 787 Dreamliner, AI 111, Air India flight, lizard

Civil Aviation Minister Ashok Gajapathi Raju on Saturday denied reports of a lizard being found in the food tray of a passenger on-board an Air India flight.

మరో వివాదంలోకి ఎయిరిండియా.. బోజనంలో బల్లి.. అదంతా ఉత్తదేనన్న గజపతి..

Posted: 06/13/2015 08:25 PM IST
Lizard in ai food tray story false fabricated minister

అంతర్జాతీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా మరో వివాదంలో ఇరుక్కుంది. ఢిల్లీ నుంచి లండన్ కు వెళ్తున్న విమానంలో సిబ్బంది ఇచ్చిన బోజనంలో బల్లి ప్రత్యక్షమవ్వడమే ఇందుకు కారణమైంది.. ఎయిరిండియా సిబ్బంది తాము చేసిన తప్పును సరిదిద్దుకుని సదరు కస్టమర్ కు వేరే బోభనం ఇచ్చిన పక్షంలో ఎలాంటి వివాదం తెరపైకి వచ్చేది కాదు. అయితే అందుకు భిన్నంగా వ్యవహరించిన ఎయిర్ ఇండియా సిబ్బంది కస్టమర్ తో దురుసుగా వ్యవహరించడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా వున్నాయి. ఢిల్లీ విమానాశ్రయం నుంచి లండన్ కు బయలుదేరిన విమానం.. టేకాఫ్ అయిన తరువాత..  మధ్యాహ్న భోజనంలో భాగంగా విమానం సిబ్బంది ఇచ్చిన.. ప్లేట్లో బల్లి దర్శనమివ్వడంతో వివాదం రేగింది. లండన్ కు వెళ్తున్న ఎఐ 111 విమానంలో తనకిచ్చిన భోజనంలో బల్లి కనిపించడంతో షాకయ్యిన ప్రయాణికుడు సదరు విషయాన్ని విమాన సిబ్బందికి తెలిపాడు. సిబ్బంది అది బల్లి కాదంటూ. వేరే బోజనాన్ని అతడికి ఇచ్చేందుక ునిరాకరించారు. దీంతో విస్మయానికి గురయ్యాడు సదరు ప్రయాణికుడు.

తనకు ఇచ్చిన ఆహారపు  ట్రేలో బల్లి కనిపించగానే  షాకయ్యాననీ,... ప్లేట్ మార్చి ...వేరేది ఇమ్మంటే సిబ్బంది చాలా దురుసుగా ప్రవర్తించారని  ఆ ప్రయాణికుడు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనపై ఎయిర్ ఇండియాకు తాను ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అయితే ఆ ఆరోపణలను ఎయిర్ ఇండియా యాజమాన్య సంస్థతో పాటు భారత విమానయానశాఖ మంత్రి అశోక్ గజపతి రాజు కూడా ఖండించారు. ఆహారంలో బల్లి ఉండటం పూర్తిగా అవాస్తవమని తెలిపారు.  ప్రయాణికుడి నుంచి తమకు  ఎలాంటి  ఫిర్యాదు అందలేదని.. ఇది కేవలం కల్పిత కథనంగా ఆయన చెప్పుకోచ్చారు.
 
జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : AI 111  Air India flight  lizard  Minister Ashok Gajapathi Raju  

Other Articles