vishal approached madras high court on nadigar sangam election

Hero vishal approached madras high court

vishal, tollywood, hero vishal, South Indian Film Artistes' Association, Nadigar Sangam, kollywood, Tamil, movies, news, headlines, gossip, entertainment, videos, songs, music, Tamil trailers, Tamil videos, Tamil mp3, Tamil actress,Tamil actors, Tamil movies reviews,Tamil movie reviews,Tamil movie previews,Tamil songs, Tamil music, Tamil top 10, Tamil movie gallery,Tamil mp3,bakthi,Tamil films,latest Tamil movies

As, South Indian Film Artistes Association (Nadigar Sangam) holding their election on July 15, Tamil actor Vishal approached madras high court on change of Nadigar Sangam election date.

కాలీవుడ్ సినీ‘మా’ ఎన్నికలలోనూ అలజడి..! కోర్టును ఆశ్రయించిన హీరో

Posted: 06/12/2015 09:28 PM IST
Hero vishal approached madras high court

తెలుగు సినిమా కళాకారుల ఎన్నికల సందర్భంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్'(మా) ఎన్నికల సమయంలో ఉతప్పన్నమైన పరిస్థితులే ఇప్పుడు తమిళానాడులోనూ చోటుచేసుకుంటున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు, వివాదాలు, కోర్టు కేసులు ఇవే పరిస్థితులు ఇప్పుడు నడిగర్ సంఘం ఎన్నికలలోనూ చోటుచేసుకుంటున్నాయి. ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టు నాజర్ ఆరోపణలపై ప్రస్తుత నిడిగర్ సంఘం అధ్యక్షుడు శరత్ కుమార్ ధీటుగా స్పందించిన తరువాత.. ఇప్పుడు తాజాగా హీరో విశాల్ కోర్టుకెక్కారు. ఎన్నికల తేదీని మార్చాలంటూ హైకోర్టును ఆశ్రయించారు.

నడిగర్ సంఘం ఎన్నికల బరిలో విశాల్ దిగుతున్నారని, అందుకని ప్రచారానికి ఆయనకు సమయం సరిపోనందుకు ఎన్నికల తేదీని మార్చాలని ఆయన మద్రాస్ హై కోర్టును ఆశ్రయించారు. గత కొంత కాలంగా శరత్ కుమార్, విశాల్ మధ్య విభేదాలు నడుస్తున్నాయి. శరత్‌కుమార్‌ నేతృత్వంలోని ప్రస్తుత కార్యవర్గంపై నటుడు విశాల్ మాత్రమే కాదు.... సీనియర్‌ నటుడు నాజర్‌ బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసారు. విశాల్‌ పోటీ చేస్తానంటే ఎదుర్కొనేందుకు తానూ సిద్ధమేనని, అయితే విశాల్‌ తీవ్ర పోటీని ఎదుర్కోవాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. నడిగర్ సంఘం భవన నిర్మాణం విషయంలో పెద్ద గొడవే సాగుతుందని.... ఆ పరిణామాలే ఇపుడు విశాల్ ఎన్నికల్లో పోటీ చేసే విధంగా చేస్తున్నాయన కథనాలు వెలువడుతున్నాయి.

నాజర్ కూడా ప్రస్తుత సంఘం తీరుపై ఆగ్రహంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. నూతన భవనం నిర్మాణం వ్యవహారంపై శ్వేతపత్రం విడుదల చేయాలని నాజర్ కోరుతున్నారు. విశాల్‌ మాట్లాడుతూ... భవన నిర్మాణానికి సంబంధించి న్యాయబద్ధమైన సమాధానం దొరకలేదని, అందుకే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల్లో పోటీచేసేందుకు నిర్ణయించుకున్నానని చెప్పారు. ఈ విషయంలో ఆయన శరత్ కుమార్ తో తాడోపేడో తేల్చుకునేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అవాస్తవ ప్రకటనలపై ప్రశ్నిస్తే తప్పా? సంఘం నుంచి బహిష్కరించినా భయపడను అంటున్నారు విశాల్ కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో నడిగర్ సంఘం ఎన్నికల తేదీపై విశాల్ కోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hero vishal  South Indian Film Artistes' Association  Nadigar Sangam  

Other Articles