India | America | US | snacks | nestle | Ban

United states ban more snacks export from india

India, America, US, snacks, nestle, Ban

United States ban more snacks export from india. Indian regulators’ findings that samples of Nestle. Maggi instant noodles contained impermissibly high levels of lead stunned middle-class consumers this month. But long before India yanked the product off store shelves, U.S. food-safety inspectors had deemed hundreds of made-in-India snacks unfit for sale in America.

ఇక్కడ మ్యాగీ ఒక్కటే.. అదే అమెరికాలో మనవి ఎన్నో

Posted: 06/12/2015 03:21 PM IST
United states ban more snacks export from india

మ్యాగీ నూడిల్స్ ఇప్పడు ఇండియాలో హాట్ టాపిక్ గా మారింది. మ్యాగీ నూడిల్స్ లో మోతాదు కన్నా హానికరమైన లెడ్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంది అని తేలింది. దాంతో ఇండియాలోని చాలా రాష్ట్రాలు మ్యాగీ అమ్మకాలపై నిషేదం విధించింది. అయితే మ్యాగీలో అలాంటి హానికరమైన పదార్థాలు ఏమీ లేవని నెస్లే సంస్థ వాదిస్తోంది. తాము తయారు చేస్తున్న మ్యాగీలో లెడ్ మోతాదు ఎక్కుగా ఏమీ లేదని తమ పరీక్షలో తేలిందని కూడా అంటోంది. అంతేకాకుండా మ్యాగీని బ్యాన్ చెయ్యడంపై కోర్టుకు కూడా వెళ్లింది. మ్యాగీ మీద ఉన్న బ్యాన్ ను ఎత్తివేయాలని కోర్టులో పిటిషన్ వేసింది. అయితే యు.ఎస్ కేంద్రంగా సాగుతున్న నెస్లే సంస్థ తయారు చేస్తున్న మ్యాగీ గురించి నిజాలు బయటికి వచ్చాక.. ఏ ఏ దేశాల్లో ఎలాంటి ఆహార పదార్థాలు బ్యాన్ చెయ్యబడ్డాయి అన్న డౌట్ వచ్చింది. అయితే తీరా వివరాలు తెలిసిన తర్వాత షాక్ కు గురవుతారు. ఎందుకంటే ఇండియా నుండి ఎక్కువగా ఎక్స్ పోర్ట్ అవుతున్న స్నాక్స్ లో ఎక్కువ శాతం యుఎస్ లో బ్యాన్ కు గురవుతున్నాయంటే నమ్ముతారా..? కానీ నిజం.

భారతదేశం నుండి తయారవుతున్న వస్తువులు ఎక్కువగా ఎక్స్ పోర్ట్ అవుతున్న దేశాల జాబితాలో యుఎస్ ముందుంటుంది. కానీ అక్కడ ఆ దేశం ఎక్కువగా బ్యాన్ అవుతున్న వస్తువుల జాబితాలో ఇండియా వస్తువులే ఎక్కువగా ఉన్నాయంటే నమ్మాలి మరి. అక్కడ ఎక్కువగా రకరకాల కారణాలతో ఇండియాకు చెందిన వస్తువులనే బ్యాన్ చేస్తోంది యుఎస్. యుఎస్ ఎప్డిఎ బ్యాన్ చేసిన స్నాక్స్ జాబితాలో 97 రకాల ఇండియన్ స్నాక్స్ ను యుఎస్ బ్యాన్ చేసింది. ఇండియా తర్వాత మెక్సికో కు చెందిన 30శాతం స్నాక్స్ పై బ్యాన్ విధించగా తర్వాత వేరేవేరే దేశాల స్నాక్స్ బ్యాన్ చేశారు. అయితే ఒక్క ఇండియాలోని కన్జుమర్స్ పై అమెరికా లాంటి దేశాలు కొన్ని వందల కోట్ల రూపాయల బిజినెస్ చేస్తోంది. కానీ అమెరికాలో మాత్రం మన వస్తువులపై బ్యాన్ ఉంటుంది. దానికి తగిన కారణాలను కూడా అక్కడి ప్రభుత్వం చూపిస్తుంది. కానీ మన దగ్గర మాత్రం ఫుడ్ కార్పోరేషన్ పెద్దగా వాటి గురించి పట్టించుకోదు. అమెరికా నుండి వచ్చే స్నాక్స్ ను మన వాళ్లు గుడ్డి పర్మిషన్ ఇస్తుంటారు. అయితే నెస్లె సంస్థ మాత్రం తమ పరీక్షల్లో మాత్రం ఎలాంటి ప్రమాదకర లెడ్ లేదు అని తేలింది కాబట్టి బ్యాన్ ను ఎత్తివేసేలా చూడాలని కోర్టుకు నివేదించింది. అయితే నెస్టె కంపెనీపై భారత్ లో వ్యతిరేకత వస్తోంది. పనికి మాలిన కారణాలతో అమెరికా ఇండియాకు చెందిన స్నాక్స్ పై బ్యాన్ వేస్తోందని.. మరి అలాంటప్పుడు ప్రమాదరకర స్థాయిలో లెడ్ ఉందని తెలిసినా ఎందుకు బ్యాన్ వెయ్యకూడదో చెప్పాలంటూ ప్రశ్నలు వస్తున్నాయి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  America  US  snacks  nestle  Ban  

Other Articles