ఓటుకు నోటు వ్యవహారంలో ప్రస్తుతం కస్టీడీ ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డి కూతురు నిశ్చితార్థం ఎంతో ఘనంగా జరిగింది. ఈ నిశ్చితార్థానికి తెలుగుదేశం పార్టీ అదినేత, ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన సతీమణి, కొడుకు నారా లొకేష్ లు కూడా హాజరయ్యారు. ఎన్ కన్వెన్షన్ కు చేరుకున్న చంద్రబాబు నాయుడకు రేవంత్ తరఫు బంధువులు స్వాగతం పలికారు. నిశ్చితార్థానికి వచ్చిన వాళ్లతో మాట్లాడే అవకాశం లేకపోవడంతో కేవలం నవ్వుతూ పలకరించారు. చంద్రబాబు నాయుడు పక్కనే సోఫాలో కూర్చున్న రేవంత్ రెడ్డి ఫోటోలకు ఫోజులిచ్చారు. తర్వాత చంద్రబాబు నాయుడు దంపతుల తుల మీదుగా నిశ్చితార్థ ఉంగరాలు కాబోయే వధూవరులకు అందించారు. రేవంత్ కూతురు నైమిషారెడ్డి, రేవంత్ అల్లుడు సత్యనారాయణ రెడ్డి ఉంగరాలు మార్చుకున్నారు.
రేవంత్ కూతురు నిశ్చితార్థం పూర్తిగా నిఘా నీడలో సాగింది. ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి ఎవరి దగ్గర మాట్లాడకుండా జాగ్రత్త పడ్డారు. ఎవరితోనూ మీట్ కాకపోవడమే కాకుండా ఫోన్ కూడా మాట్లాడేందుకు కోర్టు అనుమతించలేదు. రేవంత్ చుట్టూ ప్రత్యేక పోలీసులు ఎస్కార్ట్ గా ఉన్నారు. ఎన్ కన్వెన్షన్ ఎంట్రెన్స్ దగ్గరి నుండి లోపలికి వస్తున్న ప్రతి ఒక్కరి మీద.. ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్న వారి కదలికల మీద పోలీసులు గట్టి నిఘా ఉంచారు. ఈ నిశ్చితార్థం కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు, లోకేష్, ఏపీకి చెందిన పలువురు మంత్రులు, తెలంగాణ టీడీపీ నేతలు, కాంగ్రెస్ నేత దానం నాగేందర్ తదితరులు హాజరై కాబోయే వధువరులను ఆశీర్వదించారు.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more