vijayawada private hospital doctors careless | child rescue from death by parents during burial | Crime news

Vijayawada private hospital doctors careless child rescue from death by parents during burial

private hospitals, child rescue from death, child burial, private doctors neglegence, private doctors controversy,

vijayawada private hospital doctors careless child rescue from death by parents during burial : By the neglegence of vijayawada private doctors a small child going to death. But finally the child resuced by parents during burial

బ్రతికేవున్న పాపను చంపబోయిన ప్రైవేట్ డాక్టర్లు

Posted: 06/10/2015 07:06 PM IST
Vijayawada private hospital doctors careless child rescue from death by parents during burial

ప్రైవేటు ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం లభిస్తుందన్న ఉద్దేశంతో చాలామంది అటువైపే ఎక్కువ దృష్టి సారిస్తారు. ఎంత డబ్బులు ఖర్చైనా ఫర్వాలేదని తెగించి మరీ ముందుకొస్తారు. అయితే.. తాజాగా చోటు చేసుకున్న సంఘటన ప్రజల్లో వున్న ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. బ్రతికేవున్న పాపను చనిపోయిందని నిర్ధారించిన ప్రైవేట్ ఆస్పత్రి డాక్లర్ల నిర్వాకంతో పసిపాప ప్రాణాలు పోవాల్సిన పరిస్థితి తలెత్తింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విజయవాడకు చెందిన ఓ దంపతులు తమ ఏడాది పాపకు తీవ్ర అనారోగ్యం రావడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ ఆమెకు చికిత్స చేసిన వైద్యులు.. పాప మృతి చెందిందని డిశ్చార్జ్ చేశారు. దీంతో ఎంత డబ్బు ఖర్చు చేసినా తమ పాప మిగల్లేదని, కడుపుకోతే మిగిలిందని ఆ దంపతులు నిరాశతో కూరుకుపోయారు. ఆ పాపను ఖననం చేసేందుకు వాళ్లు శ్మశానానికి తీసుకెళ్లారు. అయితే.. ఇంతలోనే ఆ పాప ఊపిరి తీసుకోవడాన్ని ఆ దంపతులు గమనించారు.

అంతే! ఖననం తంతుని ఆపేసి.. క్షణం ఆలస్యం చేయకుండా ఆ దంపతులు తమ పాపను వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమెకు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. దీంతో అప్పటివరకు విషాదంలో మునిగిపోయిన ఆ దంపతుల జీవితంలో తిరిగి సంతోష ఘడియలు తిరిగి వచ్చాయి. మరోవైపు.. ప్రైవేట్ ఆస్పత్రి డాక్టర్ల నిర్వాకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : child rescue from death  private doctor neglegence  

Other Articles