Chandrababu Naidu met with PM Narendra Modi on Wednesday | Phone Tapping Controversy | Revanth Reddy

Chandrababu naidu met pm narendra modi phone tapping controversy revanth reddy

chandrababu naidu, pm narendra modi, phone tapping controversy, revanth reddy incident, ysr congress party news, chandrababu controversies, trs party sensation, trs party updates, phone tapping, babu phone tapping

Chandrababu Naidu met PM Narendra Modi Phone Tapping Controversy Revanth Reddy : AP cm chandrababu naidu met with pm narendra modi to discuss about phone tapping which creates controversy in two telugu states.

బాబు ప్రధాని మోదీతో భేటీ అయింది అందుకేనా?

Posted: 06/10/2015 06:24 PM IST
Chandrababu naidu met pm narendra modi phone tapping controversy revanth reddy

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఓటుకు నోటు వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన నేపథ్యంలో బాబు ఈ విధంగా ఆయన్ను కలవడం ఆసక్తి నెలకొంది. నిజానికి ఆ వివాదం నుంచి బయటపడేందుకే బాబు ప్రధానితో భేటీ అయినట్లు చెప్పుకుంటున్నారు. ఈ భేటీ సందర్భంగా ఆయన ఓటుకు నోటు  వ్యవహారంలో తెలంగాణ సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై ఆయన ఈ సందర్భంగా ప్రధానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. తన ఫోన్‌ ట్యాపింగ్‌ అంశాన్నికూడా చంద్రబాబు... ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం.

ఈ క్రమంలోనే బాబు ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ 8 అమలు చేయాలని మోదీని కోరినట్టు తెలిసింది. సెక్షన్‌ 8 ప్రకారం ఉమ్మడి హైదరాబాద్‌లో అధికారాలు గవర్నర్ చేతిలో ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. దీంతోపాటు తెలుగు రాష్ట్రాల్లో చోటుచేసుకున్న తాజా రాజకీయ పరిణామాలను కూడా.. మోదీకి వివరించారని సమాచారం. మరి.. దీనిపై మోదీ ఎలా స్పందించారోనన్నది వేచి చూడాల్సిందే! మరోవైపు.. చంద్రబాబు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో వరుసగా భేటీ కానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu naidu  narendra modi  phone tapping  revanth reddy  

Other Articles