JP | demand | Chadrababu | resign

Jayaprakash narayana questioed the tdp president and ap cm chandrababu naidu

JP, demand, Chadrababu resign, chandrababu, Jayapraksh Narayana, Telangana, Politics, MLC elections,

Jayaprakash Narayana questioed The TDP president and ap cm Chandrababu naidu. If the voice is not fabricated, ARE YOU READY TO RESIGN

చంద్రబాబుకు జెపి సూటి ప్రశ్నలు

Posted: 06/10/2015 09:54 AM IST
Jayaprakash narayana questioed the tdp president and ap cm chandrababu naidu

ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు పాత్రపై అన్నిపార్టీల నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. తాజాగా లోక్ సత్తా పార్టీ నేత జయప్రకాశ్ కూడా చంద్రబాబును ఈ విషయం మీద ప్రశ్నించారు. మీడియాకు బహిర్గతమైన ఆడియో టేపులు నిజమైతే బాబు.. రాజీనామాకు సిద్ధమా అని లోక్ సత్తా నేత జయప్రకాశ్ నారాయణ సవాల్ విసిరారు. చంద్రబాబు ప్రమేయం లేకుండానే రేవంత్‌రెడ్డి స్టీఫెన్‌సన్‌కు డబ్బు ఇవ్వచూపారా అని ప్రశ్నించారు. జగన్ అంటే భయపడి.. గతిలేని స్థితిలో చంద్రబాబుకు పట్టం కట్టారని తెలిపారు. ప్రజలను రెచ్చగొట్టే విధంగా బాబు మాట్లాడటం సరికాదన్నారు. ఏపీ దివాళా తీసిందని చెప్పే నేతలు ఎమ్మెల్సీ ఎన్నికలకు డబ్బులెలా వచ్చాయని ప్రశ్నించారు. రాష్ట్రం దివాళా తీస్తుంటే నేతలు మాత్రం అపరకుబేరుల్లా అవుతున్నారని మండిపడ్డారు.

జెపి సూటిగా అడిగిన నాలుగు ప్రశ్నలు..  
* ఒకవేళ ఆ వాయిస్ మీదే(చంద్రబాబునాయుడుది) అయితే రాజీనామాకు సిద్దమేనా..?
* మీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలను కొనడానికి 5 కోట్లు ఆఫర్ చెయ్యలేదా..?
* ఆయన (రేవంత్) మీ సూచనలను పాటించలేదా..?
* ఒకవేళ ఆయన సొంతంగా ఇలా చేసి ఉంటే, ఎందుకు ఇప్పటి దాకా చర్యలు తీసుకోలేదు..?

//అభినవచారి//

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : JP  demand  Chadrababu resign  chandrababu  Jayapraksh Narayana  Telangana  Politics  MLC elections  

Other Articles