Chandrababu | Security | Guards | Telangana

Some changes in the security of ap cm chandrababu naidu

Chandrababu, Security, Guards, Telangana

Some changes in The security of Ap cm Chandrababu Naidu. Telangana police guards will appear in outer layer in the chandrababu security.

బాబు సెక్యురిటీ మీద డౌటా..?

Posted: 06/10/2015 08:04 AM IST
Some changes in the security of ap cm chandrababu naidu

ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడిన ఆడియో టేపులను విడుదల చెయ్యడంతో ఖంగుతిన్నారు. అయితే చంద్రబాబు నాయుడును, కొంత మంది తెలుగుదేశం పార్టీ కీలకనేతల మీద ఎంతో కాలం నుండి నిఘా ఉంచినట్లు ఏపి అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే నారా చంద్రబాబు నాయుడును చాలా క్లోజ్ గా గమనిస్తున్నట్లుగా కూడా వారు అనుమానిస్తున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు సెక్యురిటీలో మార్పులు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భద్రతలో ఏపీ పోలీసులు భారీ మార్పులు చేశారు. మూడు వలయాలుగా ఉండే రక్షణలో అంతర్గత, మధ్య వలయంలో పూర్తిగా ఏపీ పోలీసులనే నియమించారు. బాహ్య వలయంలో ఇరు రాష్ట్రాల పోలీసులు ఇప్పటిలాగే కొనసాగుతారు. అంతర్గత వలయంలో పూర్తిగా ఏపీ పోలీసులే ఉండేలా కొన్ని నెలల క్రితమే మార్పులు చేసిన అధికారులు.. తాజాగా మధ్యవలయంలోని కొందరు తెలంగాణ పోలీసులను బాహ్య వలయంలోకి పంపించారు.

గత కొంత కాలంగా ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు మీద హైదరాబాద్‌లో నిఘా ఎక్కువైనందుకుగాను.. తాజాగా ఆయన సెక్యురిటీలో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు అంతర్గత, మధ్య వలయంలో పనిచేసే భద్రతా సిబ్బంది వ్యక్తిగత ఫోన్ల వాడకంపై ఆంక్షలు విధించారు. విధుల్లో చేరేముందు వారు ముఖ్య భద్రతాధికారి (సీఎస్ఓ)కి ఫోన్లను అప్పగించాలి. సందర్శకులు, ఎమ్మెల్యేలు సైతం భద్రతాధికారి దగ్గర అప్పగించాల్సిందే. ఈ విషయంలో బంధువులకు కొంత సడలింపు ఉంటుంది. సీఎంతో భేటీకి వెళ్లే మంత్రులు, ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులకు మాత్రం ఫోన్లకు అనుమతి ఉంటుంది. అయితే చంద్రబాబు నాయుడు భద్రతలో జరుగుతున్న మార్పులు గమనిస్తున్న వాళ్లు మాత్రం చంద్రబాబు సెక్యురిటి కూడా తెలంగాణ ప్రభుత్వానికి సహకరిస్తున్నారా..? అనుమానాలు కలిగేలా చేస్తోంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu  Security  Guards  Telangana  

Other Articles