Narasimhan | Governor | Tapping | KCR | Chandrababunaidu

Governor narasimhan clear to central home minister rajnath singh that no phone tapped in ap and telangana

Narasimhan, Governor, Tapping, KCR, Chandrababunaidu, Phones, Telangana

Governor Narasimhan clear to Central Home minister Rajnath singh that no phone tapped in ap and telangana. Narasimhan will submit a report on whole issue.

ట్యాపింగ్ లేదు.. ఏమీ లేదు

Posted: 06/10/2015 07:42 AM IST
Governor narasimhan clear to central home minister rajnath singh that no phone tapped in ap and telangana

ఓటుకు నోటుకు వ్యవహారంలో చంద్రబాబు నాయుడు మాట్లాడినట్లు బయటపడ్డ ఆడియో టేపులపై ట్యాపింగ్ ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఏపి అధికారులు దీనికి సంబందించిన ఆధారాలు కూడా సంపాదించినట్లు కూడా వారు వాదిస్తున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారం మీద కేంద్రానికి ఫిర్యాదు చెయ్యడానికి సిద్దపడింది. ఇందులో భాగంగా ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలవనున్నారు. కాగా ఈ మొత్తం వ్యవహారం మీద గవర్నర్ తన నివేదికను సమర్పించనున్నారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో అసలు ఫోన్‌ ట్యాపింగే జరగ లేదని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ తెలిపారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.  నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్సన్‌ ఇంటిపై ఏసీబీ అధికారులు కేవలం నిఘా పెట్టారని మాత్రమే వివరించారా? ఇందుకు సంబంధించిన అన్ని సాక్ష్యాధారాలతో ఢిల్లీ వస్తున్నానని చెప్పారా!? ఈ మేరకే ఆయన కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారా!? ఈ ప్రశ్నలు అన్నిటికీ ‘ఔను’ అనే జవాబు వస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఫోన్‌ ట్యాపింగ్‌ వివాదం నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ గవర్నర్‌ నరసింహన్‌కు ఫోన్‌ చేసినట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఒక ముఖ్యమంత్రి ఫోన్‌ను ట్యాప్‌ చేస్తే మీరేమి చేస్తున్నారు? అని ప్రశ్నించినట్లు సమాచారం. దీంతో, హైదరాబాద్‌లో ఎలాంటి ట్యాపింగూ జరగలేదని గవర్నర్‌ ఆయనకు వివరించినట్లు తెలిసింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్లను తెలంగాణ సీఎం కేసీఆర్‌ ట్యాప్‌ చేయించలేదని, ఈ మేరకే తాను తన నివేదికలో వివరిస్తానని స్పష్టం చేసినట్లు సమాచారం. స్టీఫెన్సన్‌ చేసిన ఫిర్యాదు మేరకు ఏసీబీ ఆయన ఇంటిపై నిఘా పెట్టిందని, ఈ క్రమంలోనే చంద్రబాబుకు, ఆయనకు మధ్య జరిగిన సంభాషణ బయటకు వచ్చిందని నరసింహన్‌ తన నివేదికలో పొందుపరిచినట్లు తెలిసింది. అవినీతిపై సమాచారం వచ్చినప్పుడు ఏసీబీ నిఘా వేస్తుందని, ఆ విషయాన్ని తనకు చెప్పాల్సిన అవసరం లేదని కూడా గవర్నర్‌ తన నివేదికలో స్పష్టం చేసినట్లు తెలిసింది. చంద్రబాబుపై ఏసీబీ అనుబంధ ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేస్తే మాత్రం దర్యాప్తునకు తన అంగీకారం అవసరమని పొందుపరిచినట్లు సమాచారం. ఈ విషయంలో కేంద్రమే మార్గదర్శకత్వం అందించాలని గవర్నర్‌ రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరినట్లు తెలిసింది. ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలతో ఢిల్లీ వస్తున్నానని కూడా ఆయన రాజ్‌నాథ్‌కు చెప్పారు.

ఇక మరోవైపు ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందనే ఆరోపణలు నిరాధారమైనవని ఏసీబీ డీజీ ఏకే ఖాన్‌ ఖండించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహా ఎవరి ఫోన్లనూ తాము ట్యాప్‌ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ కేసులో ప్రొఫెషనల్‌ విచారణ అధికారులతో దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. కేసు ఏదైనా చట్టానికి లోబడే ఏసీబీ విచారణ జరుగుతుందన్నారు.

ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందనే ఆరోపణలు నిరాధారమైనవని ఏసీబీ డీజీ ఏకే ఖాన్‌ ఖండించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహా ఎవరి ఫోన్లనూ తాము ట్యాప్‌ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ కేసులో ప్రొఫెషనల్‌ విచారణ అధికారులతో దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. కేసు ఏదైనా చట్టానికి లోబడే ఏసీబీ విచారణ జరుగుతుందన్నారు. - See more at: http://prabhanews.com/%E0%B0%AB%E0%B1%8B%E0%B0%A8%E0%B1%8D%E2%80%8C-%E0%B0%9F%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%AA%E0%B0%BF%E0%B0%82%E0%B0%97%E0%B1%8D%E2%80%8C-%E0%B0%86%E0%B0%B0%E0%B1%8B%E0%B0%AA%E0%B0%A3%E0%B0%B2%E0%B1%81-%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B0%E0%B0%BE%E0%B0%A7%E0%B0%BE%E0%B0%B0%E0%B0%82-%E0%B0%8F%E0%B0%95%E0%B1%87-%E0%B0%96%E0%B0%BE%E0%B0%A8%E0%B1%8D%E2%80%8C#sthash.aGA97VZx.dpuf

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Narasimhan  Governor  Tapping  KCR  Chandrababunaidu  Phones  Telangana  

Other Articles