Telangana, KCR, Secular, Hyderabad, Swachhhyderabad

Telangana cm chandrashekar rao told a mosquito joke in the swachh hyderabad meeting

Telangana, KCR, Secular, Hyderabad, Swachhhyderabad

Telangana cm Chandrashekar Rao told a mosquito joke in the swachh hyderabad meeting. KCR said that the mosquitos are secular.

కేసీఆర్ చెప్పిన దోమ జోకు

Posted: 06/06/2015 04:27 PM IST
Telangana cm chandrashekar rao told a mosquito joke in the swachh hyderabad meeting

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటకారితనం గురించి ప్రత్యేకంగా .. కొత్తగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఆయన మాటల ఎఫెక్ట్ ఉద్యమ సమయంలో ఎంత ఉందో అందరికి తెలుసు. ఎదుటివారిని తన మాటల తూటాలతో.. జోకులు వేసి మరీ వెక్కిరిచడం కేసీఆర్ స్టైల్. తాను చెప్పాలనుకున్న మ్యాటర్ ను ఓ కథలాగా చెప్పడంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎవరూ సాటిరారు. అయితే పాపం తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుండి కాస్త బిజీగా అయినట్లున్నారు. చాలా కాలం తర్వాత కేసీఆర్ జోకు వేశారు అది కూడా స్వచ్ఛ హైదరాబాద్ ప్రోగ్రాంలో. ఇంతకీ కేసీఆర్ ఏం జోకు వేశారు అనుకుంటున్నారా..? అయితే స్టోరీ మొత్తం చదవాల్సిందే..

హైదరాబాద్ ను విశ్వనగరంగా మార్చడంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి స్వచ్ఛ్ హైదరాబాద్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే తాజాగా రంగారెడ్డి జిల్లా ఎన్బీటీ నగర్ లో స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించారు కేసీఆర్. అయితే స్వచ్ఛ హైదరాబాద్ గురించి మాట్లాడుతూ ‘‘దోమ ఎవరినైనా కుడుతుంది. అది సోషలిస్టు. అది నన్ను కుడుతుంది, కలెక్టర్‌ను కుడుతుంది, చివరకు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయను కూడా వదలదు’’ అని చమత్కరించారు. కాబట్టి, పేదల నుంచి ప్రభుత్వం దాకా.. అందరం కలిసి హైదరాబాద్‌లో దోమల నిర్మూలనను చేపట్టాల్సి ఉన్నదని వివరించారు. మొత్తానికి దోమలను నివారించడానికి స్వచ్ఛ హైదరాబాద్ ను చేపట్టండి అని చెప్పడానికి దోమ జోక్ చెప్పారు కేసీఆర్.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  KCR  Secular  Hyderabad  Swachhhyderabad  

Other Articles