capital, ap, pooja, chandrababunaidu, bhuvaneshwari, lokesh

Ap capital city pooja started this morning at three oclock

capital, ap, pooja, chandrababunaidu, bhuvaneshwari, lokesh

ap capital city pooja started this morning at three o'clock. ap cm chandrababu naidu attend the pooja programmee with his family members.

ITEMVIDEOS: రాజధాని నిర్మాణ పూజ ప్రారంభం

Posted: 06/06/2015 08:01 AM IST
Ap capital city pooja started this morning at three oclock

నూతన రాజధాని నిర్మాణానికి మరికొన్ని గంటసేపట్లో శ్రీకారం చుట్టనున్నారు. తుళ్లూరు మండలం మందడం-తాళ్లాయపాలెం గ్రామాల మధ్య శభూమిపూజ నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. మందడం గ్రామ రెవెన్యూ 136 సర్వే నంబర్‌లోని బెజవాడ సత్యనారాయణకు చెందిన స్థలంలో శాస్త్రోక్తంగా పూజ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారు. చుట్టూ పచ్చని పంట పొలాల మధ్య కృష్ణా నదికి ఈశాన్యంలో సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో భూమిపూజ కార్యక్రమాలు పూర్తిగా సంప్రదాయబద్దంగా శాస్త్రోక్తంగా జరగనున్నాయి. రేపల్లె ప్రాంతం నల్లూరికి చెందిన దాశరధి సిద్ధాంతి ఆధ్వర్యంలో వాస్తు సిద్ధాంతులు సూచించిన ప్రదేశంలో వేద పండి తుల మంత్రోచ్ఛారణల మధ్య భూమిపూజ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ సందర్భంగా నాభిశిల స్థాప నం, హోమాలు, పూజలు నిర్వహించనున్నారు.

తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. మొదటగా గంగా, కావేరి, కృష్ణా, గోదావరి, తుంగభద్ర నదీ జలాలతో పాటు పవి త్ర మానస సరోవర్‌ నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చిన జలంతో భూమిపూజ స్థలాన్ని సంప్రోక్షణ చేయనున్నారు. అనంతరం గో పూజతో కార్యక్రమాలు మొదలుకానున్నాయి. భూమిపూజవైష్ణవ సంప్రదాయం ప్రకారం తొలుత విశ్వక్షేణ పూజతో ప్రారంభం కానుంది. అనంతరం పుణ్యాహవచనం, అష్టదిక్పాలక పూజ, వాస్తు పూజహోమం, రత్నన్యాపం, హలయజ్ఞం, వేద పండితుల అశీర్వచన కార్యక్రమాలు జరగనున్నాయి.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్‌లు భూమిపూజలో పాల్గొననున్నారు. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాంతంలో జరిగే వివిధ కార్యక్రమాలలో పాల్గొననున్నారు. భూమిపూజ జరిగే స్థలంలో ప్రత్యేకంగా రాతితో తయారు చేసిన నాభిశిలను ప్రతిష్టించనున్నారు. తెనాలిలో ప్రత్యేకంగా వెండితో తయారు చేసిన బంగారు పూత పూసిన తాపీ భూమిపూజకు ఉపయోగించనున్నారు. హలయజ్ఞం సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్థలంలో సీఎం చంద్రబాబు సంప్రదాయ బద్దంగా ఆరక దున్నుతుండగా ఆయన స తీమణి భువనేశ్వరి ఆ ప్రాంతంలో నవధాన్యాలు చల్లనున్నారు. పూజ అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులతో మాట్లాడనున్నారు.

భూమిపూజ జరిగే ప్రాంతంలో భద్రతపై అధికారులు దృష్టి సారించారు. గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే, రూరల్ ఎస్పీ నారాయణనాయక్, భద్రత అధికారి జోషి శుక్రవారం ఏర్పాట్లను పరిశీలించారు. తొలుత సీఆర్‌డీఏ కార్యాలయంలో కలెక్టర్ మాట్లాడుతూ అధికార యంత్రాంగం సమన్వయంతో భూమిపూజకు అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. భూమిపూజకు అవసరమైన సామగ్రిని మందడం సర్పంచి ముప్పవరపు పద్మావతి, సుమారు కిలో వెండితో వెండిబొచ్చె, బంగారు పూత పూయించిన తాపీని అంగలకుదురుకు చెందిన రిటైర్డ్ జూనియర్ వెటర్నరీ అధికారి ఆలపాటి వెంకటరామయ్య కలెక్టర్‌కు అందజేశారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : capital  ap  pooja  chandrababunaidu  bhuvaneshwari  lokesh  

Other Articles