we holds chandrababu and stephen phone conversations recordings says nayini

Acb officials hold records of chandra babu calls says nayini

nayini narasimha reddy, Telangana home minister nayini, acb holds chandrababu and mla stephen phone conversations recordings, revanth reddy, chandra babau, horsetrading, chandra babu call records, mla stefen, acb officials

Telangana government holds chandrababu and mla stephen phone conversations recordings says nayini narasimha reddy

బాబు ఫోన్ సంభాషణ రికార్డులు వున్నాయని నాయిని సంచలన వ్యాఖ్యలు

Posted: 06/03/2015 01:16 PM IST
Acb officials hold records of chandra babu calls says nayini

ఓటుకు నోటు కుంభకోణం మరో పెద్ద మలుపు తిరుగుతోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనే క్రమంలో చంద్రబాబు నాయుడు మాట్లాడిన ఫోన్ సంభాషణలు తమ దగ్గర ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డికి గెలుపు కోసం చంద్రబాబు.. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కోనేందుకు చంద్రబాబు కుట్ర పన్నారని నాయిని ఆరోపించారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్తో టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్వయంగా మాట్లాడినట్లు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచన మేరకే రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బేరమాడారని ఆయన వ్యాఖ్యానించారు. అందుకు సంబంధించి.. ఆధారలు (స్టీఫెన్ తో చంద్రబాబు సల్పిన ఫోన్ సంబాషణలు) కూడా తమ వద్ద వున్నాయని నాయిని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు తారుమారు కానున్నాయని ఆయన అన్నారు. త్వరలోనే ఆధారాలన్నీ బయట పెడుతామని నాయిని నరసింహారెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.. ఏసీబీ అధికారులు చంద్రబాబు ఫోన్ రికార్డులు కూడా ఉన్నట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. అయితే చంద్రబాబు ఆడియో ఫుటేజి బయటకు వస్తే మాత్రం రాజకీయంగా అది పెను ప్రకంపనలను సృష్టించడం ఖాయమని అంటున్నారు. స్టీఫెన్తో చంద్రబాబు ఏం మాట్లాడారన్నది చాలా కీలకంగా మారనుంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles