బాలీవుడ్ స్టార్లు అమితాబ్ బచ్చన్, మాధురి దీక్షిత్, ప్రీతి జింటాపై మ్యాగీ కేసు నమోదు చేయాలని బీహార్ కోర్టు పోలీసులను ఆదేశించింది. అవసరమైతే వారిని అరెస్టు చేయాలని తెలిపింది. ముజఫర్‌పూర్ అదనపు ముఖ్య న్యాయమూర్తి రాంచంద్ర ప్రసాద్ కేసును పరిశీలించి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. నెస్లే కంపెనీకి చెందిన మ్యాగీ నూడుల్స్ తిని తాను అనారోగ్యానికి గురయ్యానని న్యాయవాది సుదీర్ కుమార్ ఓజా కోర్టులో పిటిషన్ వేశారు. ఆ నూడుల్స్‌లో హనికరమైన మోనో సోడియం గ్లూటామెట్ ఉందని తెలిపారు. అయితే ఈ బాలీవుడ్ స్టార్లు ప్రచారకర్తలుగా వ్యవహరించి తనను తప్పుదారి పట్టించారని పిటిషన్లో పేర్కొన్నాడు. వారితో పాటు నెస్లే ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మోహన్ గుప్తా, జాయింట్ డైరెక్టర్ సబాబ్ ఆలంపై కోర్టు చర్య తీసుకోవాలని తెలిపారు. ఈ మేరకు మ్యాగీ న్యూడుల్స్ ప్రచారకర్తలుగా వ్యవహరించిన బాలీవుడ్ స్టార్లపై పోలీసులు కేసు నమోదు చేయనున్నారు.
అయితే ఇప్పటికే ఉత్తర ప్రదేశ్ ఆహార, ఔషద సంస్థ దీనిపై మాధురి దీక్షిత్‌కు నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఈ ఆరోపణల నేపథ్యంలో నెస్లే ఇండియాపై విచారణ జరిపించాలని భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థను కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ ఆదేశించారు. తాము ఆ నూడుల్స్ సాంపిళ్లను ల్యాబ్‌కు పంపామని, తినడానికి అభ్యంతరం ఏమీ లేదని నెస్లే ఇండియా తెలిపింది. అయితే మ్యాగీ నూడుల్స్‌పై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో హర్యానా ఆరోగ్య మంత్రి స్పందించారు. తమకు నాణ్యత కలిగిన ల్యాబ్‌లు ఉన్నాయని, నూడుల్స్‌ను పరీక్షించాలని తన శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశానని తెలిపారు. కాగా కేరళ ప్రభుత్వం కూడా ఈ నూడుల్స్‌పై నిషేదం విధించింది. రాష్ట్రంలో ఎక్కడా పౌర సరఫరా కార్పొరేషన్ దుకాణాల్లో అమ్మకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ మంత్రి అనూప్ జాకబ్ కార్పొరేషన్‌కు ఆదేశాలు జారీ చేశారు. స్పష్టత వచ్చే వరకు ఈ నిషేదం కొనసాగుతుందని తెలిపారు.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more