cash-for-vote scandal: TDP mla revanth reddy arrested

Tdp mla revanth reddy arrested in bribery case

TDP MLA Revanth reddy arrested in bribery case, cash-for-vote scandal, Telangana Mlc election, telangana mla revanth reddy arrested, anti corruption bureau officials, Rs. 50 lakh, nominated Mla stephen, Rs 5 crore, lalaguda

Another cash-for-vote scandal rocks in Telangana Mlc election, telangana mla revanth reddy arrested red handedly by anti corruption bureau officials while handing over Rs. 50 lakh to nominated Mla stephen in lalaguda

ఓటుకు నోటు కుంభకోణం: ప్రభుత్వమే బనాయించిందన్న రేవంత్ రెడ్డి

Posted: 05/31/2015 07:39 PM IST
Tdp mla revanth reddy arrested in bribery case

టీఆర్ఎస్ కేసీఆర్ వర్సెస్ టీడీపీ రేవంత్ రెడ్డి పోరు కోనసాగుతుందని, తమపై అక్రమంగా కేసులు బనాయించి లోబర్చుకుని పార్టీలో కలుపుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం యత్నిస్తుందని.. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అరోపించారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ ఫోన్ చేసి రమ్మంటేనే తాను వెళ్లానని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేసేందుకోసం స్టీఫెన్కు 50 లక్షల రూపాయలు ఇస్తుండగా రేవంత్ రెడ్డిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ విషయమై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన తాను ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థి కానని చెప్పారు.

ఈ కేసు విషయంపై రేవంత్ మీడియాతో మాట్లాడుతూ.. తననపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేదిలేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ పై తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని అన్నారు. అన్ని కేసులను తాను కూడా రాజకీయంగానే ఎదుర్కొంటానని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ పై కూడా ఇలాంటి కేసులు పెట్టి తనను అరెస్టు చేసిన పోలీసులతోనే కేసీఆర్ ను అరెస్టు చేయిస్తామని చెప్పారు. టీడీపీ క్యాంప్ ఒకచోట సాగుతుండగా, మీరు ఇక్కడకు ఎందుకువచ్చారని ప్రశ్నించిన మీడియాను మీ కార్యాలయాలు ఎక్కడో వుంటే మీరు ఇక్కడకు రాలేదా..? అని మీడియానే ఎదురు ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న అక్రమ విధానాలన్నింటినీ తాము తిరగతోడిస్తామని చెప్పారు.

నామినేటడ్ ఎమ్మెల్యే స్టిఫెన్ కు 50 లక్షల రూపాయలు ఇస్తున్న క్రమంలో అరెస్టు చేశారన్న మీడియా ప్రశ్నలపై ఆయన అక్రమంగా డబ్బును తీసుకువచ్చిన పోలీసులు.. తనపై అక్రమంగా కేసులు బనాయించి ప్రభుత్వమే ఇరికించిందని రేవంత్ అరోపించారు. కాగా రేవంత్ రెడ్డిని లాలాగూడ నుంచి సికింద్రాబాద్ ప్రాంతంలోని ప్రత్యేక ప్రదేశంలో దర్యాప్తు చేసిన పోలీసులు.. అతన్ని బంజారాహిల్స్ లోని ఏసీబి కార్యాలయానికి తరలించినట్లు సమాచారం.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cash-for-vote scandal  revanth reddy  arrest  bribery case  

Other Articles