cash-for-vote scandal: TDP mla revanth reddy arrested

Tdp mla revanth reddy arrested in bribery case

TDP MLA Revanth reddy arrested in bribery case, cash-for-vote scandal, Telangana Mlc election, telangana mla revanth reddy arrested, anti corruption bureau officials, Rs. 50 lakh, nominated Mla stephen, Rs 5 crore, lalaguda

Another cash-for-vote scandal rocks in Telangana Mlc election, telangana mla revanth reddy arrested red handedly by anti corruption bureau officials while handing over Rs. 50 lakh to nominated Mla stephen in lalaguda

ఎమ్మెల్యేకు డబ్బులిస్తూ పట్టుబడ్డ రేవంత్ రెడ్డి

Posted: 05/31/2015 07:34 PM IST
Tdp mla revanth reddy arrested in bribery case

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలలో మరో ఓటుకు నోటు కుంభకోణం బట్టభయలైంది. దీంతో అనూహ్యంగా, అకస్మాత్తుగా తెలంగాణలో రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేకెత్తాయి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని ఏసీబీ అధికారులు  అరెస్ట్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేసేందుకోసం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్కు డబ్బులు పంపిణీ చేస్తుండగా రేవంత్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.  టీడీపీ అభ్యర్థికి ఓటు వేస్తే 5 కోట్ల రూపాయలు ఇస్తామని రేవంత్ రెడ్డి.. స్టీఫెన్ను  ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించినట్టు సమాచారం. సికింద్రాబాద్లోని లాలాగూడలో స్టీఫెన్కు 50 లక్షల రూపాయలు ఇస్తుండగా పోలీసులు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు.

పోలీసులు రేవంత్ రెడ్డిని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించడం లేదు. బోయగూడలో రేవంత్ రెడ్డి ఇంటి వద్ద మీడియా ప్రతినిధులు చేరుకున్నారు. ఇంట్లో రేవంత్ లేరని సంబంధీకులు చెబుతున్నారు. మరోవైపు కాసేపట్లో  పోలీసులు రేవంత్ రెడ్డిని మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్టు వార్తలు వస్తున్నాయి. కాగా రేవంత్ అరెస్టు విషయం తెలుసుకున్న తెలంగాణ టీడీపీ నేతలు సీనియర్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు నేతృత్వంలో డీజీపీ అనురాగ్ శర్మను కలిశారు. రాజకీయ కక్షతో తమ ఎమ్మెల్యేను అధికార పక్షం అరెస్టు చేసిందని ఎర్రబెల్లి డీజీపికి ఆరోపించారు.

తెలంగాణ శాసనమండలిలో రేపు శాసనసభ్యుల కోటాలో 6 స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీడీపీకి తగినంత బలం లేకపోవడంతో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీపెన్ తో గత వారం రోజులుగా రేవంత్ బేరసారాలు ఆడుతున్నారని, సమాచారం. మొత్తంగా ఐదు కోట్ల రూపాయలను స్టీఫెన్ కు ఇచ్చేందుకు అంగీకరించిన రేవంత్. ఇవాళ అడ్వాన్సుగా 50 లక్షల రూపాయలను స్టీఫెన్ ఇచ్చేందుకు నేరుగా ఆయన ఇంటికి చేరకున్నారు. అయితే గత వారం రోజుల నుంచి రేవంత్ తో జరుగుతన్న బేరసారాల విషయమై స్టీపెన్ ఏసీబి అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో ఇవాళ డబ్బులు ఇస్తున్న క్రమంలో 50 లక్షల రూపాయలను ఏసీబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారని సమాచారం.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cash-for-vote scandal  revanth reddy  arrest  bribery case  

Other Articles