girl alleges abduction, gangrape in uttar pradesh

Girl abducted gangraped in up

girl abducted gangraped in up, rape, Gangrape, Uttar Pradesh, Muzaffarnagar, gangraped, Sakoti, Shamli district, Rajnish and Sachin,

A 20-year-old girl was allegedly abducted and gang-raped by three persons in Sakoti village of Shamli district following which the accused were arrested, police said on Friday.

కామాంధుల పాశవికచర్య.. యువతిపై గ్యాంగ్ రేప్

Posted: 05/29/2015 05:40 PM IST
Girl abducted gangraped in up

ఉత్తరాధి రాష్ట్రాల్లో మహిళలపై అఘాయిత్యాల పరంపర కోనసాగుతుంది. ఉత్తర్ ప్రదేశ్ లో పాశవిక మృగాళ్లు ఓ అమ్మాయిని కిడ్నాప్ చేసి.. మరి సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. ఆడవారి మానప్రాణాలకు భద్రత కల్పిస్తామంటూ అధికారంలోకి వచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. అరచక శక్తుల ముందు మోకరిల్లుతున్నాయా..? అన్న సందేహాలు వచ్చేట్లుగా జరుగుతున్న వరుస ఘటనలు.. మహిళల మానప్రాణాలకు ఎక్కడ భద్రత వుందో చెప్పాల్సిన అవసరం ప్రభుత్వాలకు వుంది. లేని పక్షంలో ఇది మరో సమస్యగా మారి యావత్ దేశ రాజకీయాలనే మార్చేసే సమయం కూడా వస్తుంది.

తల్లికి చేదోడుగా వెళ్లి పొలం పనులు చేయడమే ఆ యువతికి శాపంగా పరిణమించింది. పొలం పనులు చేస్తున్న 20 ఏళ్ల యువతిని ముగ్గురు యువకులు అపహరించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆటస్యంగా వెలుగుచూసింది. కాగా అత్యాచారం చేసిన ముగ్గురు యువకులలో ఒక మైనర్ బాలుడు కూడా ఉండటం గమనార్హం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోలం పనులు చేసుకుంటున్న 20 ఏళ్ల యువతిని అపహరించేందుకు ముగ్గురు యువకులు యత్నించారు.  అక్కడే పనిచేస్తున్న అమె తల్లి వారిని అడ్డుకునేందుకు యత్నించగా, ఆగ్రహించి యువకులు... ఆమెను చెట్టుకు కట్టేశారు.

అనంతరం ఆమె కుమార్తెను ఎత్తుకుపోయి... సామూహిక అత్యాచారం చేశారు. ఈ దారుణమైన సంఘటన ఉత్తరప్రదేశ్ షామిల్ జిల్లాలోని సకోటి గ్రామంలో ఈ నెల 25వ తేదీన చోటు చేసుకోగా.. గత మూడు రోజులుగా కామాంధులు యువతిపై అదే పనిగా వరుస క్రమంలో అత్యాచారానికి తెగబడ్డారు. యువతి బంధువుల ద్వారా సమాచారం అందుకున్న గ్రామాస్థులు..  గురువారం బాధితురాలిని రక్షించారు. అనంతరం వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు నిందితులలో మైనర్ బాలుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన ఇద్దరు నిందితులు రజనీష్, సచిన్లుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించగా... ఆమెపై అత్యాచారం జరిగినట్లు వైద్య పరీక్షల్లో నిర్థారణ అయిందని పోలీసులు చెప్పారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gangrape  Sakoti  Shamli district  Rajnish and Sachin  

Other Articles