CCTV Captures Assault On Bangla Woman In D-Mart In Anekal

Bangladeshi woman thrashed and humiliated by d mart staff

Bangladeshi woman thrashed and humiliated by D-Mart staff, Bangladeshi woman, D-Mart mall, Anekal, Bengaluru, attack, Congress leader Manjula, billing mistake, Rashida Begum, Bangladeshi national, Narayana Hrudayalaya hospital, money looted, husband treatment, Bangladeshi woman. D mart Shopping mall, Manjula, Hebbagodi police

A Bangladeshi woman Rashida Begum, was thrashed and humiliated by Congress leader Manjula and D-Mart staff for a billing mistake. who had come down to Bengaluru to get her husband treated in the famed Narayana Hrudayalaya hospital

ITEMVIDEOS: మానవత్వం మంటకలిసింది.. మహిళను వివస్త్రను చేసి కొట్టిన ‘డీమార్ట్’

Posted: 05/29/2015 05:34 PM IST
Bangladeshi woman thrashed and humiliated by d mart staff

మానవత్వం మంట కలిసింది. శత్రువైనా ఇంటికి వస్తే.. వారికి నమస్కరించాలని చెప్పే మన దేశ సంప్రదాయాన్ని మంటగలిపేలా డీ మార్ట్ షాపింగ్ మాల్ సిబ్బంది, వారికి తోడు ఓ కాంగ్రెస్ నాయకురాలు వ్యవహరించిన ఉదంతం ఆలస్యంగా వెలుగుచూసింది.  నిత్యం దురాగతాలను చూసి చూసి మనిషి కూడా అదే బాటలో పయనిస్తున్నాడనటానికి బెంగుళూరులో చోటుచేసుకు్న ఈ ఘటనే సాక్ష్యంగా నిలుస్తోంది. కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతన్న ఓ మహిళ అందులోనూ విదేశీ మహిళ చేసిన చిన్న తప్పిదానికి అమెను వివస్త్రను చేసి. దారుణంగా కోట్టి అమె వద్దనున్న 65 వేల డబ్బులు లాకున్న ఘటన ఇది.

వివరాల్లోకి వెళ్తే.. పోరుగు దేశం బంగ్లాదేశ్ కు చెందిన ఓ మహిళ రషీదా బేగం, తన భర్తకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో చికిత్స నిమిత్తం బెంగళూరు హృదయాలయాలో చేర్పించింది. అయితే అస్పత్రిలోకి అమెను అనుమతిని ఇవ్వకపోవడంతో అమె తన భర్తతో పాటు తనకు కావాల్సిన సరుకులను కొనుగోలు చేసేందుకు స్థానికంగా వున్న ఢిమార్ట్ షో రూమ్ కు వెళ్లింది. సరసమైన ధరలకు నాణ్యమైన వస్తువులు లభిస్తాయని పోరుగువారు చెబితే అక్కడికి వెళ్లిందే కానీ.. తాను తెలిసి తెలియకుండా చేసిన తప్పుకు తననే టార్గెట్ చేసి చావ చితకబాదుతారని అప్పుడామెకు తెలియదు.

షాపింగ్ మాల్ లో కావాల్సిన వస్తువులన్నీ తీసుకున్న తరువాత.. అమె తాను వేసుకున్న పాదరక్షలు (చెప్పులు) బిల్లు  చెల్లించలేదు. ఈ విషయాన్ని సీసీ కెమెరా నుంచి పసిగట్టిన సిబ్బంది వెంటనే అమెను పక్కకు తీసుకువచ్చి అమె వయస్సుకు కూడా మర్యాద ఇవ్వకుండా దాడి చేశారు. అంతేకాదు సభ్యసమాజం తలదించుకునేలా బాధితురాలిని గుడ్డలూడదీసి మరి కొట్టారు. ఈ దాడికి స్థానిక మహిళా కాంగ్రెస్ నేత మంజుల సమక్షంలో జరుగింది. అంతేకాదు అమెకూడా బాధితురాలని చావ చితక కోట్టింది. తన భర్త వైద్యం కోసం అమె దాచుకున్న 65 వేల రూపాయలను కూడా వారు లాక్కున్నారు. దీంతో బాధితురాలు తరపున కొందరు వచ్చి అమెను తీసుకెళ్లి స్థానిక హెబ్బగొడి పోలిస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. స్థానిక మహిళా కాంగ్రెస్ నాయకురాలు మంజులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటనపై పూర్వపరాలపై ప్రశ్నిస్తున్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bangladeshi woman. D mart Shopping mall  Manjula  

Other Articles