MRPS | Mahanadu | TDP | banners | Burn

Mrps leaders burn tdp banners and flexies in rajendranagar

MRPS, Mahanadu, TDP, banners, Burn

Mrps leaders burn TDP banners and flexies in Rajendranagar. TDP party banners, flexies and posters in rajendranagar.

వాళ్లు టిడిపి బ్యానర్లను తగలబెట్టారు

Posted: 05/27/2015 12:07 PM IST
Mrps leaders burn tdp banners and flexies in rajendranagar

తెలుగుదేశం పార్టీ ఓ వైపు మహానాడు సంబరాల్లో మునిగితేలుతుంటే ఎమ్మార్పీయస్ కార్యకర్తలు వారికి తలనొప్పిగా మారారు. హైదరాబాద్ శివారు ప్రాంతమైన రాజేంద్రనగర్- సన్ సిటీ ప్రాంతంలో మహానాడు కోసం ఏర్పాటు చేసిన టీడీపీ బ్యానర్లను ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు తగులబెట్టారు. ఘటన ప్రాంతంలో రకరకాల పేర్లతో కరపత్రాలను వదిలివెళ్లారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతివ్వాలని అందులో డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు ఘటనాస్థలానికి చేరుకుని ఆందోళనకు దిగారు. టీడీపీ నేతల ఫిర్యాదుతో ఫ్లెక్సీలు తగులబెట్టిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అంతేకాదు రాస్తారోకో చేయడానికి యత్నించిన టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. కొద్దిరోజులుగా తెలుగు తమ్ముళ్లు చేపడుతున్న ప్రతీ కార్యాక్రమాన్ని ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు అడ్డుకొంటున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వరంగల్ జిల్లాలో జరిగిన టీడీపీ సభా వేదికకు నిప్పు పెట్టారు. అంతేకాదు సభ ప్రాంగంణంలో ఫ్లెక్సీలను తగలబెట్టిన విషయం తెల్సిందే!

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MRPS  Mahanadu  TDP  banners  Burn  

Other Articles