Mahanadu | chandrababu | balakrishna | harikrishna | lokesh

Nara chabdrababu naidu starts mahanadu in gandipet at hyderabad

Mahanadu, chandrababu, balakrishna, harikrishna, lokesh

Nara chabdrababu naidu starts Mahanadu in gandipet at hyderabad. Chandrababu flag asting tdp party flag in mahanadu.

మహానాడును ప్రారంభించిన చంద్రబాబు

Posted: 05/27/2015 11:34 AM IST
Nara chabdrababu naidu starts mahanadu in gandipet at hyderabad

తెలుగుదేశం పార్టీ 34వ మహానాడును ప్రారంభిస్తు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీ జెండా ఎగరవేశారు. ఈ ఉదయం 11 గంటల ప్రాంతంలో సభా వేదిక దగ్గరకు చేరుకున్న చంద్రబాబు మహానాడును ప్రారంభించారు.  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు నడుచుకుంటూ సభా వేదిక వద్దకు చేరుకున్నారు. చంద్రబాబుకు బోనాలు, బతుకమ్మలతో మహిళలు స్వాగతం పలికారు. మహానాడుకు రెండు రాష్ర్టాల నుంచి భారీగా కార్యకర్తలు తరలివస్తున్నారు. మూడు రోజుల పాటు జరిగే మహానాడుకు భారీ ఏర్పాట్లు చేశారు. ముందుగా పార్టీ జెండాను ఎగరేసిన తర్వాత జ్యోతి ప్రజ్వలన చేసి, ఎన్డీఆర్ విగ్రహానికి పూల మాల వేశారు. ముందు చంద్రబాబు నాయుడు , తర్వాత హరికృష్ణ ఆ తర్వాత బాలక్రిష్ణలు ఎన్డీఆర్ విగ్రహానికి పూల మాల వేశారు.

మూడు రోజుల పాటు సాగే తెలుగుదేశం పార్టీ మహానాడుకు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లోని తెలుగు దేశం పార్టీ అభిమానులు గండిపేటకు తరలివచ్చారు. నారా లోకేష్ మహానాడు ఏర్పాట్లను ముందుండి చశారు. ఇక ఏపికి చెందిన 14 తీర్మానాలు తెలంగాణకు చెందిన 10 తీర్మానాలను మహానాడులో పెట్టనున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్మానాలు ప్రవేశపెట్టాలని మహానాడు నిర్ణయించింది. ఇక తెలుగుదేశం పార్టీని జాతీయపార్టీగా మార్చడం, లోకేష్ కు కీలక బాధ్యతలు ఇవ్వడం లాంటివి మహానాడులో జరననున్నాయి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahanadu  chandrababu  balakrishna  harikrishna  lokesh  

Other Articles