will dominate Ysrcp with police support says KE Krishnamurthy

Ke krishnamurthy differs with chandrababu

krishnamurthy differs with chandrababu, will dominate Ysrcp with police support says KE, andhrapradesh deputy chief minister KE Krishnamurthy, KE Krishnamurthy, AP chief minister chandrababu, AP Deputy CM, chandrababu, police support, ysrcp, TDP president chandrababu

andhrapradesh deputy chief minister KE Krishnamurthy who differed with chandrababu yesterday, said will dominate opposition with police support today in kurnool mini mahanadu

ITEMVIDEOS: ఆయనంతే.. మనస్సులో ఏదనిపిస్తే దాన్ని బయటకు చెప్పేస్తారంతే..

Posted: 05/24/2015 03:42 PM IST
Ke krishnamurthy differs with chandrababu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చూపంతా పశ్చిమ గోదావరి జిల్లాపైనే ఉందని తమ సొంత జిల్లా కర్నూలుపై ఆయన దృష్టి పెట్టడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి కె.ఈ. కృష్ణమూర్తి ఇవాళ మరోమారు తన మనస్సులోని మాటలను బయటపెట్టారు. రాష్ర్టంలో వైఎస్సార్‌సీపీని అణచివేసేందుకు అధికార తెలుగుదేశంపార్టీ ఎంతకైనా తెగిస్తుందన్న విషయం స్పష్టమైయ్యేలా ఆయన వివాదాస్పద వ్యాఖ్యాలు చేశారు. వైఎస్సార్‌సీపీ నేతలను అణగదొక్కేందుకు పోలీసుల సాయం కూడా తీసుకుంటామని సాక్షాత్తూ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మనసులో మాట బయటపెట్టేశారు. ఎక్కడ ఏ అధికారి కావాలో జాబితా ఇస్తే, అందుకు తగ్గట్లుగా చర్యలు తీసుకునేలా చంద్రబాబును ఒప్పిస్తానని ఆయనకు మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారని కేఈ పేర్కోన్నారు.

కర్నూలు జిల్లా టీడీపీ మినీ మహానాడు సాక్షిగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కర్నూలు శివారులోని ఎంఆర్‌సీ కన్వెన్షన్‌లో నిర్వహించిన మినీ మహానాడు కార్యక్రమాన్నికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైన కేఈ మాట్లాడుతూ... జిల్లాలో వైఎస్సార్‌సీపీని అణగదొక్కేందుకు పోలీసుల సహాయం తీసుకోవాలని మనసులో మాట చెప్పేశారు. ‘‘ఇది ఫ్యాక్షన్ జిల్లా. జిల్లాలో మంత్రాలయం, ఆదోని, బనగానపల్లె వంటి ఫ్యాక్షన్ ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ వైఎస్సార్‌సీపీ బలంగా ఉంది. 11 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. ఈ ప్రాంతాల్లో పర్యటించి వాళ్లను ఎట్లా అణగదొక్కాలి? ఏ విధంగా పోలీసు సాయం తీసుకోవాలి? అనే విషయాల్ని అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లాలి’’ అని ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడుకు చెప్పారు.

వైఎస్సార్‌సీపీ నేతల గర్వాన్ని అణగదొక్కాలంటే ముఖ్యమంత్రి పూర్తిస్థాయిలో సహకరించాలన్నారు. అలా జరిగేలా ఇన్‌చార్జి మంత్రి ప్రయత్నించాలని కోరారు. ఇన్‌ఛార్జి మంత్రి అచ్చెన్నాయుడు కూడా దీటుగానే స్పందించారు. ‘‘మండలాల్లో ఏయే అధికారుల వల్ల ఇబ్బంది ఉంది, ఎవరు ఉండకూడదు, ఎవరు కావాలనే జాబితా ఇస్తే దానిపైనే నేను సంతకం పెట్టి అందుకు తగ్గట్లుగా చర్యలు తీసుకోవాలని అధినేతను కోరతా’’నని హామీ ఇచ్చారు. నియోజకవర్గాల్లో కార్యకర్తల కష్టాల గురించి జాబితాలు సిద్ధంచేసి ఇస్తే అధినేత దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు.

జిల్లాలో టీడీపీ ఓటమికి చంద్రబాబే కారణమని కేఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎన్నికల అనంతరం బాబును కలవడానికి ఎప్పుడు పోయినా... మీ జిల్లాలో మూడు సీట్లే గెలిచారు.. పశ్చిమగోదావరిలో 16కు 16 సీట్లొచ్చాయంటున్నారు. ఆయన దృష్టంతా పశ్చిమగోదావరిపైనే ఉంది. కర్నూలుపైన లేదు. ఇందులో మా తప్పేం లేదు. ఎన్నికలకు నెల రోజుల ముందు కాంగ్రెస్‌లో ఊగిసలాడుతున్న వారిని పార్టీలో చేర్చుకున్నారు. ప్రజలు వారిని నమ్మకపోవడంతో ఓడిపోయారు. మైనార్టీ, క్రిస్టియన్ ఓట్లూ రాలేదు’’ అని చెప్పారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KE Krishnamurthy  AP Deputy CM  chandrababu  police support  ysrcp  

Other Articles