If you are dying without eating beef, go to Pakistan: Mukhtar Abbas Naqvi

Beef consumers can go to pakistan says naqvi

Mukhtar Abbas Naqvi, beaf, cow slaughter, Pakistan, beef ban, arab countries, Muslims are against beef, Narendra Modi government, prime minister naredra modi, eradicate poverty among minorities, Muslims development

In another shocking statement, the Minister of State for Parliamentary Affairs Mukhtar Abbas Naqvi on Thursday justified the beef ban and asked all those who want to eat beef to go to Pakistan

బీఫ్ తినవాళ్లు పాకిస్థాన్, ఆరబ్ దేశాలకు వెళ్లండి..

Posted: 05/22/2015 10:39 PM IST
Beef consumers can go to pakistan says naqvi

మహారాష్ట్రలో గోవధను నిషేధించడంపై కొన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతున్న తీవ్ర అభ్యంతరాలపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ మండిపడ్డారు. గోమాంసం తినకపోతే చచ్చిపోతారనకుంటే.. పాకిస్థాన్ వెళ్లాలని సలహా ఇచ్చారు. దానివల్ల లాభం గానీ, నష్టం గానీ లేవని, అది కేవలం విశ్వాసాలకు సంబంధించిన విషయమని ఆయన అన్నారు. హిందువులకు సున్నితమైన అంశమని ఆయన ఓ జాతీయ మీడియా (అజ్ తక్ ఛానల్) నిర్వహించిన 'మంథన్' సదస్సులో చెప్పారు.

గోమాంసం తినకపోతే చచ్చిపోతామని అభిప్రాయపడే వాళ్లు పాకిస్థాన్కు గానీ, అరబ్బు దేశాలకు గానీ వెళ్లాలని లేదా ప్రపంచంలో మరే ప్రాంతంలోనైనా అది అందుబాటులో ఉంటే అక్కడకు వెళ్లాలని సూచించారు. కొంతమంది ముస్లింలు కూడా గోవధకు వ్యతిరేకమేనని ముక్తార్ అబ్బాస్ నఖ్వీ చెప్పారు. గోవా, జమ్ము కాశ్మీర్, కేరళ లాంటి రాష్ట్రాల్లో ఎక్కువ మంది ఈ తరహా మాంసమే తింటారని, కేంద్రం దేశవ్యాప్తంగా గోవధను నిషేధించగలదా అంటూ మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను నఖ్వీ ఖండించారు.

నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో పేదరికంలో వున్న మైనారిటీల కోసం పేదరిక నిర్మూలణ కోసం అనేక పథకాలను ప్రవేశపెడుతున్నారన్నారు. అయితే మైనారిటీలు గత కొన్ని దశాబ్దాలుగా అభివృద్దికి దూరంగా వున్నారన్న మాట మాత్రం వాస్తవమని చెప్పారు. మైనారిటీలో కోసం పలు రకాల సామాజిక భద్రత పథకాలను తీసుకువచ్చేందుకు ప్రభుత్వం యోచిస్తుందని చెప్పారు. వాటి రాకతో మైనారిటీల బతుకుల్లోని చీకట్లు తొలగిపోయి వెలుగులు నిండుతాయన్నా ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mukhtar Abbas Naqvi  Pakistan  beef ban  

Other Articles