Telangana | RTC | HIke | Charges

Telangana state may hike the charges of rtc buses soon

Telangana, RTC, HIke, Charges

Telangana state may hike the charges of rtc buses soon. The Telangana transport minister mahinder reddy conformed the hike of bus fair.

ఆర్టీసీ ఛార్జీల పెంపుకు ప్రభుత్వం రెడీ

Posted: 05/21/2015 01:22 PM IST
Telangana state may hike the charges of rtc buses soon

అవును, తాజాగా ఆర్టీసీ కార్మికులకు 44శాతం ఫిట్ మెంట్ ప్రకటించి వారి సంతోషాలకు తెరలేపారు కేసీఆర్. కానీ అందుకుగాను పెరిగిన భారాన్ని మాత్రం ఎలా తగ్గించుకోవాలి..? ఇంకేముందు జనాల మీద భారం వెయ్యడమే అందుకు తగిన మార్గం. అందుకే తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలను పెంచుతున్నట్లు రవాణామంత్రి మహేందర్ రెడ్డి వెల్లడించారు. ఆర్టీసీ మీద మోయలేని భారం పడుతోందని అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ఛార్జీలను పెంచుతున్నామని మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. అయినా వెన్నకొచ్చి ముంత దాచినట్లు ఆర్టీసీ చార్జుల పెంపుకు అంతా సిద్దమైనా పైకి మాత్రం ఆర్టీసీ భారం భరించలేకనే పెంచుతున్నామని చిలుకపలుకులు పలుకుతున్నారు మంత్రివర్యులు.

ఇప్పటికే చాలా సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. సరే అలా చార్జీలు పెంచిన తర్వాతైనా ఆర్టీసీ నష్టాల నుండి బయటపడిందా అంటే అదీ లేదు. మరి అంతదానికి ఆర్టీసీ నష్టాలను అడ్డం పెట్టుకోవడం ఎందుకు పెంచాలని అనుకుంటున్నాం అందుకే పెంచేస్తున్నాం అంటే సరిపోతుంది కదా. 44శాతం ఫిట్ మెంట్ తీసుకున్నందుకు ఆర్టీసీ కార్మికులు సంతోషపడుతున్నారు కానీ ఆర్టీసీ బస్సులు ఎక్కే వారికి మాత్రం జేబుకు చిల్లుపడనుంది. రోజు లక్షల మంది వినియోగించే ఆర్టీసీ బస్సు సర్వీసుల ఛార్జీల పెంపు పై ఇంకా ముహూర్తం మాత్రం ఖరారు కాలేదు కానీ ఛార్జీల మోత మాత్రం కన్ఫార్మ్ అయింది. మరి తెలంగాణ బస్సులు ఎక్కేవాళ్లు కాస్త జేబులు వెయిట్ ఉండేట్లు చూసుకోండి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  RTC  HIke  Charges  

Other Articles