temperature | son | telangana | ap

High temparatures in state the son performing terrific in this summer

temperature, son, telangana, ap

High temparatures in state. The son performing terrific in this summer. People fear to come out even after morning eight o'clock.High temparatures in state. The son performing terrific in this summer. People fear to come out even after morning eight o'clock.

మండుతున్న ఎండలు.. ఆపసోపాలు పడుతున్న ప్రజలు

Posted: 05/20/2015 04:57 PM IST
High temparatures in state the son performing terrific in this summer

ఎండా కాలం ఎండలు సహజం. కానీ ఎండల తీవ్రత ఎక్కుగా ఉండటం.. ఎక్కువ అంటే ఏదో ఒక్క డిగ్రీ కాదు ఏకంగా నాలుగు డిగ్రీలు పెరగడంతో జనాలు నానా కష్టాలు పడుతున్నారు. ఉదయం ఎనిమిదింటి నుంచి సాయంత్రం ఆరున్నర గంటల వరకు హీట్ పుట్టిస్తోంది. రెండు మూడు రోజుల్నుంచి బాదేస్తున్నాడు సూరీడు. 40 డిగ్రీల పైన నుంచోని కాక పుట్టిస్తున్నాడు. డే టైంలోనే కాదు. రాత్రి టైంలో కూడా వెదర్ అంతే ఉంది. వేడి ఏ మాత్రం తగ్గడం లేదు. ఉక్కపోతతో జనం ఇరిటేట్ అవుతున్నారు. ఫ్యాన్లు, కూలర్లు ఆన్ లోనే ఉన్నా.. ఉక్కపోత తప్పట్లేదు. ఈ ఎండాకాలంలో రెండు మూడు సార్లు వరస పెట్టి వానలు దంచినా.. హీట్ ఏమాత్రం తగ్గలేదు. మొన్నటి వరకు అప్పుడప్పుడూ రిలీఫ్ అయిన జనానికి.. నాన్ స్టాప్ గా బాదేస్తోన్న ఉష్ణోగ్రత తిప్పలు తెచ్చిపెట్టింది. బంగాళాఖాతం ఉపరితలంపై ఉన్న వెదర్.. టెంపరేచర్ పెరగడానికి రీజనంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. వేడి గాలులు రాష్ట్రంలోకి వచ్చాయని చెబుతున్నారు.

ఒక్కసారిగా నాలుగైదు డిగ్రీల ఉష్ణోగ్రత పెరగడానికి ఇదే కారణమంటున్నారు. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో 45 నుంచి 46 డిగ్రీల టెంపరేచర్ రికార్డవగా.. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో 42 డిగ్రీలు.. ప్రతి జిల్లాలోనూ కనీసం 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందంటున్నారు అధికారులు. అయితే.. నైరుతీ రుతుపవనాలు దేశంలోకి వచ్చే ముందు.. ఎండ ఇలాగే ఉంటుందనేది నిపుణుల మాట. అండమాన్ లోకి నైరుతీ రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చి ఆల్రెడీ మూడ్రోజులైంది. ఈ నెల చివరిలోగా కేరళలోకి వస్తాయని చెబుతున్నారు అధికారులు. ఎండని ఈజీగా తీసుకోకుండా.. జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు వాతావరణ నిపుణులు. మరో మూన్నాలుగు రోజుల పాటు.. సూరీడు కూల్ అయ్యే ఛాన్స్ లేదంటున్నారు. పాపం అప్పటి దాకా మనకు ఈ కష్టాలు తప్పవు మరీ.. సో బీ కేర్ ఫుల్..

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : temperature  son  telangana  ap  

Other Articles