jail | norway

A jail in norway having excellent luxury life for prisoners

jail, norway,

A Jail in norway having excellent luxury life for prisoners. Jail having all facilities even dont have in the normal houses.

జైలు జైలురా.. అదిరే జైలురా

Posted: 05/20/2015 04:34 PM IST
A jail in norway having excellent luxury life for prisoners

జైలంటే చిప్పకూడు.. ఎండలో రాళ్లు కొట్టుకుంటూ ఉండే ఖైదీలు.. ఇలా చాలా తెలుగు సినిమాల్లో జైల్ జీవితం గురించి చూపిస్తూ ఉంటారు. అయితే ఓ జైలును చూస్తే మాత్రం ఓ నేరం చేసైనా సరే అక్కడికి వెళ్లి అక్కడే ఉండాలని అనిపిస్తుంది. ఏంటీ.. జైలు వెళ్లాలని అనుకునేంతలా అక్కడ ఏం ఉంటుంది అనుకుంటున్నారా..? మరదే అదిసలు జైలు ఉండదు రాజమహల్ లా ఏదో పిక్నిక్ స్పాట్ లా ఉంటుంది. మరి నార్వేలోని ఓస్లోకు 75 కిలోమీటర్ల దూరంలోని ఓ దీవిలో ఉన్న ఈ జైలు పేరు.. బస్టోయ్ ప్రిజన్. ఇందులో 115 మంది కరడుగట్టిన నేరస్థులు ఇలాగే ‘శిక్ష’ అనుభవిస్తున్నారు. సాధారణ జైళ్ల తరహాలో ఫెన్సింగ్లతో కూడిన పెద్దపెద్ద గోడలు, చీకటి గదులు, సత్తుపళ్లెంలో భోజనాలు ఉండవు. ఇక్కడ అంతా వైభోగమే. ఎవరికి వారికి ప్రత్యేక గదులతోపాటు పసందైన ఆహారం కూడా లభిస్తుంది. ఇంకా చేపలు పట్టుకోవచ్చు.. గుర్రాలపై దౌడు తీయొచ్చు. టెన్నిస్ వంటి ఆటలూ ఆడుకోవచ్చు.. అవన్నీ బోర్ కొడితే ఇలా సేద తీరొచ్చు.

హత్యలు చేసినవారికి ఇలాంటి సౌకర్యాలు కూడా కల్పిస్తారా అన్నదేగా మీ డౌట్? ఓ మనిషిని జైలులో పెట్టడం అతడిలో మార్పు తీసుకురావడానికే అయితే, బస్టోయ్ ప్రిజన్ చక్కగా ఆ పని చేస్తోందని అధికారులు చెబుతున్నారు. ఈ జైలుకు వచ్చి బయటకు వెళ్లినవారిలో కేవలం 16 శాతం మంది మాత్రమే మళ్లీ నేరం చేసి ఇక్కడకు వస్తున్నారని తెలిపారు. ఇక్కడకు నేరస్థులుగా వస్తున్నవారు తమను తాము తెలుసుకునేలా చేస్తున్నామని, ఫలితంగా శిక్షాకాలం ముగిసేసరికి వారిలో చాలావరకు పరివర్తన కలుగుతోందని బస్టోయ్ మాజీ గవర్నర్ అర్నే నీల్సన్ వెల్లడించారు. ఇన్ని మంచి పనులు చేస్తున్నందుకు ఇది నిజంగా బెస్ట్ జైలే అని అనకమానరు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jail  norway  

Other Articles