Maggi | noodles | harmful | glutamate

Maggi is harmful to your children and also for you

Maggi, noodles, harmful, msg, glutamate

Despite their standard slogan 'Taste Bhi Health Bhi', Maggi Noodles comes under scanner due to High Quantities of MSG content. One of the pioneer’s in making instant noodles a sensation in India, Maggi noodles might be in trouble where samples collected from Uttar Pradesh show high content of Monosodium Glutamate

మ్యాగీ నూడిల్స్ తింటే మటాష్..

Posted: 05/20/2015 01:38 PM IST
Maggi is harmful to your children and also for you

చిన్ని చిన్ని ఆశ అంటూ చిన్నారులు అడిగే మ్యాగీ నూడిల్స్ ను అమ్మలు ఎంతో ప్రేమతో తినిపిస్తూ ఉంటారు. కానీ అలా తినిపించే మ్యాగీలు మీ చిన్నారులకు హాని చేస్తాయి అంటే మీరు నమ్ముతారా..? కానీ నమ్మాలి. నమ్మలేని నిజంలా అనిపించినా నిజం కాబట్టి నమ్మాల్సిందే. పిల్లలు, పెద్దలు అతి ఇష్టంగా తినే ఫేవరెట్ డిష్ మ్యాగీ. ముఖ్యంగా పిల్లలకు ఇదంటే మరీ ఇష్టం. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన పిల్లలు ఆకలి అనగానే... తల్లులు మ్యాగీ చేసి ఇస్తున్నారు. స్టౌ పై కొద్దిసేపు వేడినీళ్లు మరిగించి మ్యాగీ ప్యాకెట్ చించి నాలుగైదు నిమిషాల్లో చేసిన నూడుల్స్ పిల్లల ముందు ఉంచుతారు. ఇదేదో యాడ్ లో కనిపించేది మాత్రమే కాదు.. చాలా ఇళ్లల్లో జరుగుతున్నదే. కానీ ఇక ముందు మ్యాగీతో జాగ్రత్తపడాల్సిందే. లేదంటే చేజేతులా మీ పిల్లల ఆరోగ్యాన్ని మీరే దెబ్బతీసినవారవుతారు.

మ్యాగీ పిల్లల ఆరోగ్యంపై దీర్ఘకాలంలో తీవ్రమైన ప్రభావం చూపుతుందని వైద్యులంటున్నారు. ఇటీవల ఓ ప్రముఖ కంపెనీ బ్రాండ్ మ్యాగీని పరీక్షించినపుడు ప్రమాదకర స్థాయిలో అందులో మొనోసోడియమ్ గ్లుటామెట్ ఉన్నట్లు గుర్తించారు. నిజానికి మ్యాగీలో ఈ గ్లుటమేట్ 0.01 పర్ మిలియన్ ఉండాలి. కానీ ప్రస్తుతం ఉపయోగిస్తున్న మ్యాగీల్లో ఈ స్థాయి 17 పర్ మిలియన్ ఉన్నట్లు గుర్తించారు. దీర్ఘకాలంగా మొనోసోడియం గ్లుటమేట్ అధికంగా ఉన్న పదార్థాలను తీసుకుంటే తలనొప్పి, చెమటలు పోయడం, ముఖం మండుతున్నట్లు అనిపించడం, మెడ ఇంకా ఇతర శరీర భాగాల్లోనూ మంటగా ఉన్నట్లు అనిపిస్తుంది. నాడీ వ్యవస్థ దెబ్బతినడంతో పాటు అధిక రక్తపోటుకు కారణమవుతుంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ లో ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. అక్కడ మ్యాగీపై నిషేధం విధించే దిశగా అడుగులు వేస్తున్నారు.
(Source : The newindianexpress)

*అబినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(2 votes)
Tags : Maggi  noodles  harmful  msg  glutamate  

Other Articles