శాంతిభద్రతలకు నెలవుగా మారిన తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో బుధవారం ఉదయం జరిగిన కాల్పుల ఘటన కలకలం సృష్టిస్తుంది. బుధవారం ఉదయం ఏటీఎం సెంటర్ కు వెళ్లిన సాప్ట్ వేర్ ఉద్యోగినిపై దుండగలు కాల్పలు జరిపి నిలుపు దోపిడి చేశారు. అమె బ్యాంకు ఏటీయం నుంచి డ్రా చేసిన డబ్బుతో పాటు అమె వంటిపై నున్న బంగారు అభరణాలను దోంగలు అపహరించుకుపోయారు. ఉదయం ఎనమిది గంటలకు యౌసుప్ గూడలోని స్టేట్ బ్యాంక్ ఏటీయం వద్ద జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే.. ఇవాళ ఉదయం యూసుప్ గూడలోని స్టేట్ బ్యాంక్ ఏటీయం సెంటర్ కు వెళ్లిన కాల్ సెంటర్ యువతి నగదు ను డ్రా చేసింది. అంతలో ఏటీఎం సెంటర్ లోకి చెరబడిని ఓ అంగతకుడు అమెను డబ్బులు ఇవ్వమని బెదిరించాడు. అమె నిరాకరించడంతో గాల్లోకి కాల్పులు జరిపాడు. దాంతో షాక్ లో కి వెళ్లిన యువతి.. తెరుకునే లోపు నగదు తోపాటు బంగారు అభరణాలను దోచుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే తేరుకున్న సదరు యువతి స్థానికుల సహాయంతో ఎస్ ఆర్ నగర్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగా పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఏటీఎం పరిసర ప్రాంతాల్లో సీసీ పుటేజీలను పోలీసులు పరిశీలించి... నిందితులకు గుర్తించారు. నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. యువతి మధురానగర్ హాస్టల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more