mumbai | red lite area | maharastra | police | letter

Maharastra cm wrote a letter to officials on kamathipura red lite area

mumbai, red lite area, maharastra, police, letter

Residents of Mumbai's Kamathipura, considered Asia's largest red light district, have mounted a campaign to place a curb on the sex trade in the area. They are demanding that all commercial sex activity be confined to one lane, citing the stigma attached to their lives lived in the notorious address. Sex workers however have expressed helplessness, even as activists claim the move would only open up the area to property developers.

రెడ్ లైట్ ఏరియా సంగతి చూడండి

Posted: 05/16/2015 02:03 PM IST
Maharastra cm wrote a letter to officials on kamathipura red lite area

దేశ ఆర్థిక రాజధానిగా పేరున్న ముంబైలో బయటి ప్రపంచానికి తెలియని చీకటి కోణాలు ఎన్నో ఉన్నాయి. లక్షల మంది అక్కడ పొట్ట కూటి కోసం వస్తుంటారు..పోతుంటారు. అయితే ఎవరికి నచ్చిన వృత్తిని వాళ్లు చేసుకోవచ్చు. అయితే కొంత మంది వ్యభిచారం చేసి డబ్బులు సంపాదిస్తుంటారు. అయితే ముంబైలో రెడ్ లైట్ ఏరియా గురించి దేశంలో వాళ్లందరికి తెలుసు. అయితే తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేండ్ర ఫడ్నవిస్ వ్యభిచారిణిలపై ఉక్కు పాదం మోపారు. అంటే ఆయన వాళ్లను కొట్టడం... లేదా ఇంకోటో చేశారని అనుకోకండి. అక్కడి వాళ్లకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయన్న కంప్లైంట్ తో ఫడ్నవిస్ చర్యలకు దిగారు.

నగరంలోని కామాథిపూరా వాసులు సెక్స్ వర్కర్లపై కొరడా ఝుళిపించేందుకు సన్నద్ధమయ్యారు. ఆసియాలోనే అతి పెద్ద రెడ్ లైట్ జిల్లాగా పిలవబడే కామాథిపూరా ప్రాంతపు సెక్స్ వర్కర్లు తమ కార్యకలాపాలను విచ్చలవిడిగా  కొనసాగించడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  ఇకనైనా సెక్స్ వర్కర్ల వ్యాపారానికి అడ్డుకట్ట వెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే గతంలోనూ చాలా మందికి త గోడును వెల్లబోసుకున్నా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని వారు ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించారు. అందులో భాగంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ , ముంబై పోలీస్ కమిషనర్ రాకేష్ మారియాలకు లేఖలు రాశారు. ఆ సెక్స్ వర్కర్లను వేరే చోటకు తరలించాలని రెండు వేల మందికి పైగా స్థానికులు వినతి పత్రాలు సమర్పించారు. వారి కార్యకలాపాలను 11 వ వీధిగా మాత్రమే పరిమితం చేయాలని ఆ లేఖలో కోరారు. సెక్స్ వర్కర్ల కార్యకలాపాలతో మా పిల్లలకు స్కూల్ ల్లో అడ్మిషన్లు దొరకడం లేదు. మా పిల్లలకు సంబంధాలు కూడా రావడం లేదు. బంధువులు కూడా మా ఇంటికి రావడం లేదు అని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే స్థానికులకు కలుగుతున్న ఇబ్బందుల మాట వాస్తవమే అయినా.. సెక్స్ వర్కర్లను ఉన్న పలంగా ఖాళీ చెయ్యమంటే వారి పరిస్థితిని కూడా ఆలోచించాలి మరి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mumbai  red lite area  maharastra  police  letter  

Other Articles