Rahul gandhi | congress | farmers | adilabad | telangana

Rahul gandhi began padyatra in telangana

Rahul gandhi, congress, farmers, adilabad, telangana

Congress vice-president Rahul Gandhi, who is on a visit to Telangana, will not get to see the enthusiasm with which party leaders from the city, who sought to catch his eye, had decked up Hyderabad in anticipation of his arrival.

భరోసా రైతులకా..? కాంగ్రెస్ కా? రాహుల్ యాత్ర ప్రారంభం

Posted: 05/15/2015 07:38 AM IST
Rahul gandhi began padyatra in telangana

అడ్రస్ గల్లంతైన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలొ జవసత్వాలు కల్పించడానికి ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నడుంబిగించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినా.. పార్టీకి పెద్దగా కలిసి రాని తెలంగాణలోనే రాహుల్ గాంధీ తొలి పర్యటన చేస్తున్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో ఎఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్‌ గాంధీ మామడ మండలంలోని కోరిటికల్‌ నుంచి రైతు భరోసా యాత్రను నేడు ప్రారంభించనున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం కాకుండా పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. కాగా రాహుల్‌ ఢిల్లీ నుండి మహారాష్ట్రలోని నాందేడ్‌కు ప్రత్యేక విమానంలో వచ్చారు. నాందేడ్‌ విమానాశ్రయంలో ఆయనకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి,నేతలు డిఎస్‌,మధుయాష్కి ఘనస్వాగతం పలికారు. రాహుల్‌ అక్కడ నుంచి రోడ్డు మార్గంలో నేరుగా ప్రత్యేక వాహనంలో రాత్రి నిర్మల్‌కు వచ్చారు. ఆయన వెంట కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజరు సింగ్‌ వచ్చారు.

రాహుల్‌ ను చూడటానికి కార్యకర్తలు భారీస్థాయిలో చేరుకోవటంతో తోపులాట జరిగింది. ఇదిలా ఉంటే నిర్మల్‌ డిసిసి అధ్యక్షులు మహేశ్వర్‌రెడ్డి తోపాటు రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలతో భేటీ అయ్యారు. మామడ మండలం కోరిటకల్‌ నుంచి రాహుల్ తన పాదయాత్రను ప్రారంభించనున్నారు. వడ్యాల వరకు సుమారు 15 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగనుంది. ఆత్మహత్యలకు పాల్పడకుండా రైతుల్లో మనోధైర్యాన్ని నింపడంతో పాటు వారికి తమ పార్టీ అండగా ఉంటుందని భరోసా చెప్పటానికి రాహుల్ ఈ పాదయాత్ర చేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.  సాయంత్రం 4 గంటలకు వడ్యాల్‌లో బహిరంగసభలో ప్రసంగిస్తారు. పాదయాత్రలో రాహుల్‌ గాంధీ రెండు మండలాలకు చెందిన ఐదు గ్రామాల మీదుగా 15 కిలోమీటర్ల దూరం నడుస్తారు. ఈ సందర్భంగా ఈ ఐదు గ్రామాల్లో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను నేరుగా పరామర్శిస్తారు. ఒకరిద్దరు నాయకులు తప్ప ఆయనతో ఎవరూ ఉండరు. రైతులతో స్వయంగా మాట్లాడి వారికి ఆర్థిక సాయం అందజేస్తారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul gandhi  congress  farmers  adilabad  telangana  

Other Articles