Setback for Kejriwal, SC stays Delhi government order initiating defamation cases against media

Supreme court stays arvind kejriwal s anti media circular

Delhi Chief Minister Arvind Kejriwal, Delhi government, defamation proceedings against media, Justice Dipak Misra, Justice Prafulla C Pant, BJP leader Satish Upadhyay, Delhi Pradesh Congress Committee chief Ajay Maken, Ajay Maken, hypocrite, anti-democratic

Delhi CM Arvind Kejriwal suffered a huge blow, as the Supreme Court stayed the implementation of a Delhi government circular on initiating defamation proceedings against media

సర్వోన్నత న్యాయస్థానంలో కేజ్రీవాల్ కు ఎదురుదెబ్బ

Posted: 05/14/2015 04:30 PM IST
Supreme court stays arvind kejriwal s anti media circular

ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు మరోమారు ఎదురుదెబ్బబ తగిలింది. అరవింద్ కేజ్రీవాల్పై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. మీడియాపై క్రిమినల్ పరువునష్టం చర్యలు చేపట్టాలన్న కేజ్రీవాల్ నిర్ణయాన్ని గురువారం సుప్రీంకోర్టు తప్పుపట్టింది. మీడియాపై ఆప్ సర్కారు జారీ చేసిన ఉత్తర్వులపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. తన వ్యక్తిగతంగా పరువు నష్టం దావా అంశంతో, మీడియాపై చర్యలు తీసుకోవాలని ఢిల్లీ సీఎం కోరడాన్ని సర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టింది.

తమ పార్టీని నాశనం చేసేందుకు మీడియా సుపారీ తీసుకుందని, మీడియా అమ్ముడుపోయిందంటూ గత వారం కేజ్రీవాల్  వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వాక్ స్వాతంత్ర్యపు హక్కును కోల్పోతున్నానని భావించిన కేజ్రీవాల్ మీడియాపై చర్యలకు దిగారు. ఆప్ సర్కారుపై గానీ, సీఎం పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా ఉన్న మీడియా కథనాలపై కేసులు రిజిస్టర్ చేయమని అన్ని శాఖల  అధికారులకు గత వారం ఆయన సూచించారు. మీడియా సంస్థలపై పరువు నష్టం దావా వేసే అధికారాన్ని కేజ్రీవాల్ సర్కారు గతంలో జీవో తీసుకురావడంతో.. దీనిపై పలువురు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, ఆయనకు సుప్రీం కోర్టు మొట్టికాయలు వేసింది

పాలనానుభం లేని అరవింద్ కేజ్రీవాల్ కు అటు రాజకీయ అనుభవం కూడా పెద్దగా లేదు. అవినీతి రహిత భారతావని కోసం సామాజిక ఉద్యమకారుడు, అవినీతి వ్యతరిరేక ఉద్యమకర్త..  స్వాతంత్య్ర సమరయోధుడు అన్నా హజారే జన్ లోక్ పాల్ బిల్లును తీసుకువచ్చే క్రమంలో చేపట్టిన దీక్ష నేపథ్యంలోనే ఆయన ఢిల్లీ ప్రజలకు సుమరిచితులయ్యారు. పాలనాపరమైన అనుభవం అంటే ప్రజల సంక్షేమే కాదు.. ప్రతిపక్షాల విమర్శలను ఎలా తిప్పికోట్టాలా..  మీడియా కథనాలను ఎలా తనకు అనుకూలంగా మాలుచుకోవాలా అన్నది కూడా ఇందులో భాగమేకదా. ఇవి కూడా కాస్తా వంట పట్టించుకో.. కేజ్రీ.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : arvind kejriwal  supreme court  delhi  media  

Other Articles