Dawood in Pakistan, Will Get Him No Matter What: Rajnath Singh in Parliament

Dawood in pakistan we will get him back rajnath singh

Dawood Ibrahim, Rajnath Singh, Home Minister ,1993 Mumbai serial blasts, underworld don, Haribhai Chaudhury, union home minister Rajnath Singh, under world don, Indias most wanted, Dawood Ibrahim, Rajnath on Dawood, Dawood in Pakistan, Dawood Ibrahim location,

Home Minister Rajnath Singh today said India had credible information of the underworld don's Dawood Ibrahim presence in Pakistan and would bring him back "no matter what."

దావూద్ అక్కడే తలదాచుకున్నాడు.. అతన్ని ఎలాగైనా రప్పిస్తాం..

Posted: 05/11/2015 04:50 PM IST
Dawood in pakistan we will get him back rajnath singh

ముంబై పేలుళ్ల నిందితుడు, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ఎక్కడున్నాడో తెలియదంటూ.. కేంద్ర హోం శాఖ వెలువరించిన ప్రకటనపై విమర్శలు వెల్లువెత్తుతున్న క్రమంలో.. అతను పాకిస్థాన్ లోనే తలదాచుకున్నాడని, అతడిని ఎలాగైనాఇండియాకు రప్పించి తీరతామని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. దీనికి సంబంధించి  కేంద్రమంత్రి సోమవారం పార్లమెంటులో స్పష్టమైన ప్రకటన చేశారు. దావూద్ పాకిస్తాన్లో ఉన్నట్టు తమకు విశ్వసనీయ సమాచారం ఉందన్నారు.   అతణ్ని ఇండియాకు  అప్పగించాలనే  విషయంపై పాకిస్తాన్పై ఒత్తిడి తీసుకురానున్నట్టు ఆయన తెలిపారు. ఇక ఈ వివాదానికి  తొందరలోనే  ముగింపు పలుకుతామని స్పష్టం చేశారు.

కాగా గతంలో లోక్‌సభలో దావూద్ ఎక్కడున్నాడో ప్రభుత్వానికి ఇంతవరకూ తెలియదు. అతని ఆచూకీ తెలుసుకున్న తర్వాత అప్పగింత ప్రక్రియ మొదలవుతుంది’ అన్న హోం శాఖ సహాయ మంత్రి హరిభాయ్ పార్తీభాయ్ చౌధురి ప్రకటన దుమారం రేపింది. నిత్యానంద్ రాయ్ అనే సభ్యుడికి ఈమేరకు రాతపూర్వక సమాధానం ఇచ్చారు. దావూద్‌పై రెడ్ కార్నర్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నోటీసులున్నాయి. దావూద్ పాక్‌లో ఆ దేశ భద్రతా బలగాల అండతో తలదాచుకుంటున్నాడని భారత ప్రభుత్వం పలు వివరాలను పాక్‌కు అందించడం, అతన్ని తమకు అప్పగించాలని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గత ఏడాది డిమాండ్ చేశారు. . దీనికి భిన్నంగా హరిభాయ్ ప్రకటన.. ప్రతిపక్షాల ఆందోళనతో ప్రభుత్వం  ఇరకాటంలో పడినట్లయింది. ఈ నేపథ్యంలోనే లోక్‌సభలో సర్కారు   స్పష్టమైన వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఉత్పన్నమైం.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : parliament sessions  dawood ibrahim  Minister Rajnath Singh  

Other Articles