pig | hong kong | shopping mall

A pig entered into a shopping mall at hongkong

pig, hong kong, shopping mall, police, animals

A pig strayed from its usual rural haunt and into a Chai Wan shopping mall last night, leading to a four-hour stand-off with police and animal control officers.

ITEMVIDEOS: హాంకాంగ్ షాపింగ్ మాల్ లో పంది సందడి

Posted: 05/11/2015 04:54 PM IST
A pig entered into a shopping mall at hongkong

అక్కడ అందరు హడావిడిగా షాపింగ్ చేసుకుంటున్నారు.. ఒక్కసారిగా అరుపులు కేకలు.. ఒకేసారి పరుగులే పరుగులు. అసలు అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. హెల్ప్ హెల్ప్ అంటూ చాలా మంది సహాయం కోరుతున్నారు. ఇంతకీ అక్కడ ఏం జరిగింది అనుకుంటున్నారా..హాంకాంగ్‌లోని ఓ షాపింగ్ మాల్లో అడవి పంది చొరబడింది... కంగారుగా మాల్ అంతా కలియ దిరిగింది. పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసుల్ని ముప్పతిప్పలు పెట్టి.. మూడు చెరువుల నీళ్లు తాగించింది.

హాంకాంగ్‌లోని పారడైజ్ షాపింగ్ మాల్లో ఉన్న ఓ పిల్లల దుస్తుల దుకాణంలోకి.. ఎక్కడి నుంచి వచ్చిందో గాని హఠాత్తుగా ఓ అడవి పంది వచ్చి దూరింది. దుకాణంలో జనాల్ని.. పిల్లల అరుపుల్ని చూసి తత్తరపడింది. కంగారుగా దుకాణమంతా పరుగులు తీసింది. ట్రైల్ రూంలో నక్కింది. షోకేస్ పైకెక్కి కాసేపు కూర్చుంది. అక్కడి నుంచి కిందికి దూకింది. 25 కేజీల బరువున్న దాన్ని పట్టుకోడానికి పది మంది పోలీసులు, ఇతర అధికారులు అంతా పోగయ్యారు. నాలుగు గంటల తీవ్ర ప్రయత్నం అనంతరం అది వారికి చిక్కింది. దాన్ని ఓ యానిమల్ మేనేజ్‌మెంట్ సెంటర్‌కి తరలించారు. అడవి పందులు ఎక్కువగా ఉండే హాంకాంగ్‌లో ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడూ జరుగుతూనే ఉంటాయట. అంతకు ముందో సారి ఇలాగే ఓ అడవి పంది ఓ పార్కులోని స్విమ్మింగ్‌పూల్లో దూకి అక్కడి వారందరినీ కంగారు పెట్టేసిందట. అవి ఒక్కోసారి మనుషుల మీద కూడా దాడి చేస్తాయని, అందుకనే స్థానికులు వాటి పట్ల అప్రమత్తంగా ఉంటారని అధికారులు తెలిపారు.
(Source : www.scmp.com)

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pig  hong kong  shopping mall  police  animals  

Other Articles