Narendra Modi hasn't given Appointment to Cm Kcr to meet | Kcr Delhi Tour | Telangana State

Narendra modi no appointment cm kcr delhi tour

narendra modi, cm kcr, kcr delhi tour, kcr daughter kavita, parliament member kavita, narendra modi kcr news, kcr kavita photos, telangana state news, kcr controversy, narendra modi controversy, kavita controversy, telangana ministers

Narendra Modi No Appointment Cm Kcr Delhi Tour : Indian Prime Minister Narendra Modi hasn't given Appointment to Cm Kcr to meet. But he make conversation with kcr's daughter kavita for minutes.

మరోసారి కేసీఆర్ కి మొండిచెయ్యి చూపిన ప్రదాని మోడీ

Posted: 05/09/2015 10:40 AM IST
Narendra modi no appointment cm kcr delhi tour

భారత ప్రధాని నరేంద్రమోడీ తనను సహకరిస్తానన్న ఉద్దేశంతో ఎన్నో ఆశలు పెట్టుకుని హైదరాబాద్ నగరం నుంచి సీఎం కేసీఆర్ ఢిల్లీకి పయనమవ్వగా.. ఆయనకి మరోసారి అక్కడ పరాభావాన్ని చవిచూడక తప్పలేదు. ప్రధానిని కేసీఆర్ కలవాలని ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ.. మోడీ మొండిచెయ్యి చూపిన నేపథ్యంలో ఆయన ఏమీ చేయలేక వెనుదిరగాల్సి వచ్చింది. మోడీ ఇచ్చిన మరో షాక్ తో కేసీఆర్ ప్రయత్నాలు విఫలం అయ్యాయి.

వివరాల్లోకి వెళ్తే.. ప్రధాని మోడీతో రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన చర్చలు జరపాలని సీఎం కేసీఆర్ భావించి హైదరాబా నుంచి ఢిల్లీకి వెళ్లారు. అక్కడ ఆయన అపాయింట్ మెంట్ కోసం రెండురోజులపాటు వెయిట్ కూడా చేశారు. ఈ క్రమంలోనే ఆయన అక్కడున్న కేంద్రమంత్రులతో సమావేశమై రాష్ట్రంలో వున్న సమస్యలు, ఇతర వ్యవహారాలపై చర్చించారు. అదే సమయంలోనే మోడీని కలవాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ.. ఏమాత్రం ఫలితం దక్కలేదు. మోడీ ఇతర కార్యకలాపాలల్లో చాలా బిజీగా వున్నందున అప్పాయింట్ ఇవ్వకపోవడంతో కేసీఆర్ కు మరోసారి నిరాశ తప్పలేదు. దీంతో చేసేదేమీలేక.. శుక్రవారం సాయంత్రం ఆయన హైదరాబాదుకు తిరిగి వచ్చేశారు.

ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే.. తనను కలిసేందుకు రెండురోజుల పాటు వెయిట్ చేసిన కేసీఆర్ కు అపాయింట్ మెంట్ ఇవ్వని మోదీ.. ఆయన కుమార్తె-పార్లమెంట్ సభ్యురాలు కవితతో మాత్రం ఐదు నిముషాలు మాట్లాడారట! దీంతో కేసీఆర్ తో మోడీ కలవకపోవడం ఆంతర్యమేమిటోనని అందరూ చర్చించుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : narendra modi  cm kcr  mp kavita  

Other Articles