Ap | State | Capital | Donations

Ap state officials didnt care the donations to new capital city a

Ap, State, Capital, Donations, Contribution, chandrababu

Ap state officials didnt care the donations to new capital city. ap govt called for donation to construct world class capital city in andhra pradesh.

ఏపి అధికారులూ .. పైసలొస్తుంటే పట్టించుకోరేం?

Posted: 05/09/2015 10:03 AM IST
Ap state officials didnt care the donations to new capital city a

ఆకలి అరుపులకు, అరగని తేన్పులకు తేడా తెలియని వాళ్లు ఏపి అధికారులు. అవును నిజంగా ఇది నిజం. ఏపి అధికారుల వ్యవహారం చూస్తే ఇది నిజం అని నమ్మక తప్పదు మరి. అసలే ఆదాయం లేక ఆర్థికంగా ఎంతో వెనకబడింది ఏపి. హైదరాబాద్ లాంటి మహానగరాన్ని కోల్పోయి, కనీసం రాజధాని కూడా లేని ఏపికి అధికారుల పని తీరు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి సహాయ నిధికి విరివిగా విరాళాలు ఇవ్వండని ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ వైపు విజ్ఞప్తి చేస్తుండగా.. మరోవైపు కొందరు అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ఇచ్చిన రూ.2కోట్ల విరాళాలు మురిగిపోతున్నాయి. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలోని ముఖ్యమంత్రి సహాయనిధి విభాగంలోనే రాజధాని అభివృద్ధి కోసం ప్రత్యేకంగా మరో విభాగాన్ని ఏర్పాటు చేశారు. రాజధాని విరాళాలను జాగ్రత్త చేయాల్సిన బాధ్యత ఇందులో పనిచేసే సిబ్బందిదే. నిర్లక్ష్యమో, పనిభారమో కానీ రూ.2కోట్లు విలువచేసే దాదాపు 50 చెక్కులకు కాలం తీరిపోయింది. ఆంధ్రప్రదేశ్‌ కు నూతన రాజధాని నిర్మాణం కోసం విరాళాలు ఇవ్వాల్సిందిగా ఆ రాష్ట్ర ప్రభుత్వం పిలుపు ఇచ్చింది.

పాపం అని ఏపి ప్రభుత్వం పిలుపుకు  స్పందించిన దాతలు 45 కోట్ల వరకు ఆర్థిక సాయం చేశారు. చెక్కుల రూపంలోనే విరాళాలు పంపాలన్న ప్రభుత్వ నిబంధనతో అందుబాటులో ఉన్న బ్యాంకుల ద్వారా వారు ఈ విరాళాలు పంపించారు. ఈ చెక్కులను ఆరునెలలలోపే బ్యాంకుల్లో జమచేయాల్సి ఉంటుంది. తర్వాత ఆ డబ్బులు అందినట్లుగా ప్రభుత్వం నుంచి దాతలకు రసీదులు పంపాలి. కానీ, రూ.2కోట్ల విలువైన చెక్కులను సకాలంలో బ్యాంకులో జమచేయలేకపోయారు. మళ్లీ చెక్కులు పంపించాల్సిందిగా అభ్యర్థించాల్సిన పరిస్థితి దాపురించింది. ఈ చెక్కులు వృథా కావడంతో అసలు తాము పంపిన విరాళాలు ప్రభుత్వానికి చేరాయో లేదోనని ఇప్పుడు దాతలు ఆందోళన చెందుతున్నారు. అసలు ఏం జరిగింది? బాధ్యులు ఎవరు? తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? అనే దానిపైౖ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా ఆర్‌బీఐ అనుమతిస్తే ఈ చెక్కులను ఉపయోగించేందుకు ఓ నెల గడువు ఉంటుంది. మరి ఇప్పటికైనా అధికారులు మూల్కొని సొమ్మును సొమ్ము చేసుకుంటారో లేదా గాలికి వదిలేస్తారో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ap  State  Capital  Donations  Contribution  chandrababu  

Other Articles