Satyam case: Court to hear arguments on bail pleas today

Ramalinga raju caught using mobile phone in jail

Ramalinga Raju Caught Using Mobile Phone in Jail, Satyam Scam, Ramalingaraju, Ramalingaraju using mobile phone, Raju communicating with his family members and friends by phone, Satyam, Ramalinga Raju, Cherlapalli Jail, Satyam, Satyam Case, Ramalinga Raju, Special Court, Satyam Computer Services, Satyam Bail Plea

Corporate tycoon and founder of Satyam computers Ramalinga Raju was found using mobile phone inside jail. Raju, who was convicted in world's biggest corporate fraud,

చర్లపల్లి జైలులో సెల్ ఫోన్ వాడుతున్న సత్యం రామలింగరాజు

Posted: 05/07/2015 03:08 PM IST
Ramalinga raju caught using mobile phone in jail

ఆయన ఒక ఐటీ దిగ్గజం. రాష్ట్రంలో అనేక మంది ఐటీ రంగ నిపుణులు వున్నా.. ఆయన సంస్థలో పనిచేసేందుకు యావత్ యువత ఆసక్తి చూపేది. అయితే ఇది కేవలం తెలుగు రాష్ట్రాల యువతకే పరిమితం కాలేదు.. దేశంలోని యువత సైతం ఆయన సంస్థలో పనిచేయాలన్న లక్ష్యంగా పెట్టుకుని.. హైదారాబాద్ వచ్చిన సంఘటనలు, సందర్బాలు అనేకం వున్నాయి. అది ఆయనపై దేశం యువతలో వున్న ఫాలోయింగ్. అలాంటి వ్యక్తి ఎక్కడో తప్పులు చేసి.. ఎన్నోన్నో తప్పులకు కర్త, కర్మ, క్రియగా మారడటంతో ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఊచలు లెక్కపెడుతున్నారు.

ఆయనే సత్యం రామలింగరాజు.. ఆయన స్థాపించిన సంస్థ సత్యం కంపూటర్స్. అయితే ఇప్పుడు ఆయనను పట్టించుకునే వారే కరువయ్యారు. అయినా కొంత మందికి మాత్రం ఆయన దేవుడే. సత్యం సంస్థలో ఉద్యోగాలు పొంది.. జీవనోపాధి పోందుతున్న అనేక మందికి ఆయన ఆదర్శప్రాయుడే. అయితే ఇప్పటికీ తనను ఫాలో అవుతున్న ఆ కోందరికి కూడా దూరమయ్యే చర్యలను సత్యం రామలింగరాజు చేపట్టడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

చర్లపల్లి జైలులో అండర్ ట్రయల్ ఖైదీగా వున్న ఆయనకు సెల్ ఫోన్ లోనికి తీసుకురావడం పెద్ద కష్టమని తెలిసిపోయిందనుకుంటా. అందుకే ఇప్పుడు సత్యం కుంభకోణం కేసులో దోషిగా శిక్షను అనుభవిస్తున్న ఆయన.. సెల్ పోన్ ను వాడుతున్నారు. చర్లపల్లి జైల్లో ఉన్న రామలింగరాజు వద్ద ఓ సెల్‌ఫోన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జైలులోని గోదావరి బ్యారెక్‌లో అధికారులు తనిఖీలు చేస్తున్న సమయంలో సెల్‌ఫోన్‌ లభించింది. సత్యం రామలింగరాజు వద్ద నుంచి సెల్‌ఫోన్‌తో పాటు, రెండు సిమ్‌కార్డులను స్వాధీనం చేసుకున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Satyam  Ramalinga Raju  Cherlapalli Jail  

Other Articles