Don't politicalise AndhraPradesh special status issue says venkaiah naidu

Special status to andhrapradesh an important issue says venkaiah naidu

special status to AndhraPradesh, AndhraPradesh special status issue, union minister venkaiah naidu, AndhraPradesh, special status issue, dont politicalise special status issue,

union minister venkaiah naidu again talks on AndhraPradesh special status issue, says its an important issue, but dont politicalise it

ప్రత్యేక హోదాపై మళ్లీ మాటా మార్చిన వెంకయ్య..

Posted: 05/07/2015 11:59 AM IST
Special status to andhrapradesh an important issue says venkaiah naidu

ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదా అంశంలో కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు మళ్లీ మాట మార్చారు. నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా కల్పించేందుకు అన్ని రాష్ట్రాలు అంగీకరించాల్సిన అవసరం వుందని, ఇప్పుడున్న పరిస్థితులతో అది సాధ్యం కాదని గతంలో తేల్చిచెప్పిన వెంకయ్య.. ఆ తరవాత మరో అడుగు ముందుకేసి.. తనకు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాతో ఎలాంటి సంబంధం లేదని, తాను కర్ణాటక నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నానని చెప్పారు.

కాగా, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం ఇటీవల గుంటూరులో ఒక వ్యక్తి సెల్ టవర్ ఎక్కి 36 గంటల పాటు ఆందోళన చేయగా, ఎట్టకేలకు పోలీసులు అతన్ని కిందకు దింపడం.. అది చాలదన్నట్లు.. బీజేపి నేత, నటుడు శివాజీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కల్పించాలని డిమాండ్ చేస్తూ.. గత ఐదు రోజులుగా నిరాహార దీక్షకు పూనుకున్న విషయం తెలిసిందే. ప్రత్యేక హోదా కల్పనతో రాష్ట్రంలో ఇబ్బడి ముబ్బడిగా పరిశ్రమలు వస్తాయని.. వాటితో అటు అభివృద్దితో పాటు ఇటు నిరుద్యోగ సమస్య తీరుతుందని శివాజీ పేర్కోన్నారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో.. దీక్షను భగ్నం చేసిన పోలీసులు.. శివాజీని అస్పత్రిలో చేర్చడంతో.. ఇప్పుడీ అంశం హాట్ టాపిక్ గా మారింది. అటు కాంగ్రెస్ కూడా ఈ అంశంపై డిమాండ్ చేస్తూ గుంటూరులో ధర్నా చేపట్టింది.

దీంతో మరోమారు రంగంలోకి దిగిన కేంద్రమంత్రి వెంకయ్య గురువారం మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదా అంశం ఎంతో కీలకమైనదని దాన్ని రాజకీయం చేయడం సరికాదన్నారు. అంతేకాదండీ ప్రత్యేక హోదా అడిగే హక్కు ప్రజలకు ఉందని కానీ... పార్టీలకు కాదని పేర్కొన్నారు. యూపీఏ సర్కార్‌ ప్రత్యేక హోదాకు చట్టబద్ధత కల్పించి ఉంటే ఇప్పుడు సమస్య వచ్చేది కాదని వ్యాఖ్యానించారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేస్తున్నామని వెంకయ్య తెలిపారు. ఏపీ ఆర్థికలోటుపై ఆర్థిక, హోంశాఖలు చర్చిస్తున్నాయని చెప్పారు. హైకోర్టు విభజనకు కేంద్రం కట్టుబడి ఉందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : venkaiah naidu  special status  Andhra Pradesh  

Other Articles