Rahul gandhi | Defamation suit | Supreme court,

Rahul gandhi went to supreme court on defamation suit

Rahul gandhi, Defamation suit, RSS, Gandhi, Supreme court,

Rahul gandhi went to supreme court on Defamation suit. IN the Last elections rahul gandhi pronounced that rss killed mahatma gandhi. A person filed a Defamation suit on rahul gandhi.

సుప్రీంకోర్టుకు రాహుల్ గాంధీ..

Posted: 05/07/2015 01:16 PM IST
Rahul gandhi went to supreme court on defamation suit

మన నేతాగణం నోటికి వచ్చినంత మాట్లాడటం తర్వాత నాలుక్కరుచుకోవడం మామూలైపోయింది. అయితే బారతదేశానికి ఉన్న అతి పెద్ద రాజ్యాంగం అందరికి అవకాశం కల్పిస్తోంది. అందుకే ఇలా ఏమాత్రం అటుఇటుగా మాట్లాడినా.. వెంటనే పరువు నష్టం దావాలు వేసేస్తున్నారు జనం. కాస్త లా మీద పట్టుంటే చాలు కోర్టు మెట్లెక్కుతున్నారు. అయితే అలా కేసుల విషయంలో రాజకీయ నాయకులు విసిగిపోతున్నారు. ఎన్నికల్లో ప్రత్యర్థుల మీద అవాకులు చవాకులు పేలడం తర్వాత కోర్టు చుట్టు తిరగడం మామూలైపోయింది. అయితే ఇలా తిరిగి తిరిగి  విసిగిపోయిన కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ సుప్రీంకోర్టుకెక్కారు. తన మీద వేసిన పరువు నష్టం దావాలకు పాపం విసిగిన రాహుల్ బాబు ఇలా సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వచ్చింది.

విచక్షణారహితంగా పరువునష్టం దావాలు మీదపడడంతో విసిగి పోయిన కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ.. పరువునష్టం దావాల్లో క్రిమినల్ అంశాన్ని తొలగించాలని, ఈ కేసుల్ని కొట్టేయాలని కోరుతూ సుప్రీంకోర్టును అర్థించారు. 2014  ఎన్నికల ర్యాలీలో మహాత్మాగాంధీ హత్యకు ఆరెస్సెస్సే కారణమన్న రాహుల్ గాంధీపై పరువునష్టందావా దాఖలైంది. ఈ కేసు కొట్టేయాలన్న రాహుల్ అపీలును కొట్టివేస్తూ బాంబే హైకోర్టు ఆదేశించింది. తన అప్పీల్ ను కొట్టవేయడంపై రాహుల్ గాంధీ సుప్రీంకోర్టు గుమ్మం తొక్కారు. రాహుల్ పిటిషన్ జస్టిస్ దీపక్ మిశ్రా ఆధ్వర్యంలోని బెంచ్ ఎదుటకు వచ్చింది. పరువునష్టం కేసుల విషయంలో రాజ్యాంగ సూత్రాలను ప్రశ్నించింది.ఆరెస్సెస్ కార్యకర్త రాజేశ్ కుంతే చేసిన ఫిర్యాదును కొట్టివేయాల్సిందిగా కోరుతూ రాహుల్ గాంధీ మహారాష్ట్రలోని థానే జిల్లా భివాండి లోని మెజిస్టీరియల్ కోర్టుకు చేసిన అపీలును బాంబే హైకోర్టు మార్చి 10న కొట్టివేసింది. పరువునష్టం కేసుల విషయంలో రాజ్యాంగ సూత్రాలను ఈ పిటిషన్ లో ప్రశ్నించారు. పరువునష్టం కేసుల్లో క్రిమినల్ అంశం తొలగింపునకు సంబందించి బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి పిటిషన్ ను కూడా సుప్రీంకోర్టు ఆలకిస్తుంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul gandhi  Defamation suit  RSS  Gandhi  Supreme court  

Other Articles