Telangana, Students, Survey, Study,

Latest report clear that over studing will effect students memory

Telangana, Students, Survey, Study,

Latest report clear that over studing will effect students memory. students loose their memory by higher educatio. Telangana govt survey on skill development in the state.

మతి.. పోతోంది.. చదివిస్తే మతి పోతోంది

Posted: 05/07/2015 01:14 PM IST
Latest report clear that over studing will effect students memory

ఎక్కువ చదివి.. చదివి మా ఊర్లో ఒకతను పిచ్చోడయ్యాడు అని మన చుట్టు పక్కల వాళ్లు చాలా మంది అంటుంటే విన్నాం.. కాస్త డౌట్ గా ఉన్నా... నమ్మేస్తాం. ఎందుకంటే అప్పుడప్పుడు మనకు కూడా గట్టిగా చదివితే బుర్రవేడెక్కిపోద్ది మరి. చదివిస్తే  ఉన్న మతి పోయిందని ఓ సామెత. అయితే ఇది నిజంగానే నిజమంటోంది  ఓ సర్వే. రానురాను  విద్యార్థుల్లో పరిజ్ఞానం తగ్గుతోందని చెబుతోంది. ఉద్యోగాలు పొందేందుకు..విద్యార్థుల దగ్గర ఉన్న కమ్యూనికేషన్ స్కిల్స్ పై రాష్ట్రవ్యాప్తంగా ఆన్ లైన్ సర్వే నిర్వహించింది తెలంగాణ స్కిల్ మిషన్. ఇందులో టెన్త్ క్లాస్ నుంచి డిగ్రీకి వెళ్లే సరికి విద్యార్థుల్లో ఓపిక, సహనం తగ్గుతుందని తేలింది. దీంతో పాటు విద్యాప్రమాణాలు కూడా తగ్గుతున్నాయని చెప్పింది ఆన్ లైన్ సర్వే. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కంటే.. ఐటీఐ, పాలిటెక్నిక్ చదవిన విద్యార్థుల్లో టాలెంట్ ఎక్కువగా ఉందంటోంది సర్వే రిపోర్ట్.

హైదరాబాద్ లో ఉండే విద్యార్థుల కంటే..ఆదిలాబాద్ విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువగా ఉన్నాయని ఆన్ లైన్ సర్వేలో తేలింది.  టెన్త్ నుంచి పీజీ చదువుతున్న 11,570 మంది విద్యార్థులకు..ఒకే రోజు ఆన్ లైన్ లో టెస్టు నిర్వహించారు. ఈ ఎగ్జామ్ లో ఉద్యోగాలు పొందేందుకు కావాల్సిన సామర్థ్యాలపై  క్వశ్చన్స్ అడిగారు. అయితే ఇందులో ఒక్క విద్యార్థి కూడా అర్హత సాధించలేదు.  ఆన్ లైన్ టెస్టుతో ఉన్నత విద్యార్హతలు ఉన్నవారి కంటే..టెన్త్ క్లాస్ విద్యార్థుల్లోనే టాలెంట్ ఉందని తేలింది. అటు అన్ని అంశాల్లో ప్రైవేటు స్కూళ్లలో చదివే విద్యార్థుల కంటే..గవర్నమెంట్ స్కూళ్లలో చదివిన వారిలోనే తెలివి తేటలు ఎక్కువగా ఉన్నాయని వెల్లడైంది. టెన్త్ క్లాస్ చదవిన వారి కంటే..పీజీ విద్యార్థుల దగ్గర 12.8 శాతం స్కిల్స్ తక్కువగా ఉన్నాయని తేలింది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Students  Survey  Study  

Other Articles