Delhi Lieutenant Governor Najeeb Jung, Arvind Kejriwal on Collision Course as War Over Files Escalates

Delhi lieutenant governor najeeb jung arvind kejriwal war over files escalates

Arvind Kejriwal news, Arvind Kejriwal controversy, Arvind Kejriwal updates, delhi cm Arvind Kejriwal, Governor Najeeb Jung, Governor Najeeb Jung controversy, delhi government, bjp party news, bjp party updates

Delhi Lieutenant Governor Najeeb Jung Arvind Kejriwal War Over Files Escalates : In an escalation of hostilities between the two top men of Delhi, Lieutenant Governor Najeeb Jung has written to Chief Minister Arvind Kejriwal asserting that all government files must come to him.

కేజ్రీవాల్ కి ‘అంత సీన్ లేదంటూ’ చీవాట్లు పెట్టిన గవర్నర్..

Posted: 05/04/2015 11:40 AM IST
Delhi lieutenant governor najeeb jung arvind kejriwal war over files escalates

ఢిల్లీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఆప్ పార్టీ ఎన్నో విమర్శలు, ఆరోపణలను ఎదుర్కొంటూ వస్తోంది. ఇప్పటికే ఆ పార్టీలో గొడవలు చోటు చేసుకోవడంతో సీనియర్ నేతలు యోగేందర్ యాదవ్, ప్రశాంత్ భూషణ్ ను సస్పెండ్ చేసిన వ్యవహారం తెలిసిందే! ఈ క్రమంలోనే కేజ్రీవాల్ వ్యవహారశైలి అంత బాగోలేదంటూ ప్రత్యర్థి పార్టీలు తమవంతు విమర్శనాస్త్రాలు గుప్పించాయి. పైగా.. కేజ్రీవాల్ ఏకపక్షంగా వ్యవహరించడంతో తాజాగా ఆయన మీద - ‘ఆప్’ పార్టీ మీద లెప్టినెంట్ గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేజ్రీవాల్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్.. చట్టాలను గుర్తించాలని, నియమనిబంధలు పాటించాలని ఆయన కేజ్రీకి సూచించారు. ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన ఫైల్స్ అన్ని కూడా తన కార్యాలయానికి వచ్చి వెళ్లాల్సిందేనని ఆదేశించారు. ఇవి తన ఆదేశాలు కావని భారత రాజ్యాంగం ప్రకారం, జీఎన్సీటీడీ(ది గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెర్రిటరీ ఆఫ్ ఢిల్లీ) 1991 యాక్ట్, వ్యాపార లావాదేవీల నియమ నిబంధనల ప్రకారం అలా చేయాల్సిందేనని అన్నారు.

కొత్తగా ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన అరవింద్ కేజ్రీవాల్ పరిపాలనకు చెందిన ఫైల్స్ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయానికి పంపించాల్సిన అవసరం లేదని అన్ని శాఖలకు చెప్పిన నేపథ్యంలో నజీబ్ జంగ్ తాజాగా మంత్రులకు, అధికారులకు ఆ ఆదేశాలు జారీ చేశారు. మంత్రిమండలి తీసుకునే నిర్ణయాలు, ఆమోదం తెలిపే చట్టాలు తనకు తెలియజేయాలని ఆయన పేర్కొన్నారు. నజీబ్ జంగ్ బీజేపీ ఏజెంట్ అని గతంలో కేజ్రీవాల్ ఆయనను తీవ్రంగా విమర్శించిన విషయం తెలిసిందే.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Governor Najeeb Jung  Arvind Kejriwal  Bjp Party  

Other Articles