Modi Sarkar Given Counter To American USCIRF Organisation Survey On Indian Religion Issues

Modi sarkar counter attack american uscirf organisation india religion issues

Modi Sarkar, Indian Religion Issues, Forieng Ministry, Vikas Swaroop, Narendra Modi, USCIRF, America USCIRF Organisation, Hindu Muslim Religion Issues, BJP Govt, Narendra Modi News

Modi Sarkar Counter Attack American USCIRF Organisation India Religion Issues : Modi Sarkar Foriegn Ministry Given Counter To American USCIRF Organisation Survey On India Religion Issues.

అమెరికాకు కౌంటరిచ్చిన మోదీ సర్కార్

Posted: 05/01/2015 12:19 PM IST
Modi sarkar counter attack american uscirf organisation india religion issues

ప్రపంచంలో వున్న దేశాలన్నింటిలోనూ భారత్ లో మాత్రమే భిన్నమతాలు వున్న విషయం తెలిసిందే! అయితే.. వాటివల్ల అప్పుడప్పుడు మతసామరస్య గొడవలూ జరుగుతుంటాయిలెండి! ఈమధ్య గొడవలకంటే మాటలతూటాలు మరీ ఎక్కువగా పేలుతున్నాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులు మత ప్రస్తావనలు తీసుకొస్తూ ప్రజల మధ్య అగ్గిరాజేస్తుంటారు. కొందరు మతాలపేర్లు చెప్పుకునే ఓట్లు కూడా సంపాదించుకుంటుంటారు. ‘భిన్నత్వంలో ఏకత్వం’ అని భారత్ కు పేరున్నా.. మతగొడవల కారణాల వల్లే ప్రపంచదేశాలు భారత్ పై అప్పుడప్పుడు విమర్శలు గుప్పిస్తుంటారు. నిత్యం మతాల గొడవలేనా? అంటూ ఎద్దేవా చేస్తుంటారు. ఈ క్రమంలోనే మత స్వేచ్ఛపై అమెరికా తన అభిప్రాయం భారత్ కు వెల్లడించగా.. అందుకు కౌంటర్ గా మోదీ సర్కార్ ఘాటుగా సమాధానమిచ్చింది.

ఇటీవలేకాలంలో అధికార బీజేపీ నేతలు చేస్తున్న మతపరమైన వ్యాఖ్యలు ఎక్కువగా పెరిగిపోతుండటంతో.. దీన్ని అరికట్టాలని అమెరికన్ సంస్థ ‘ది యూఎస్ కమిషన్ ఫర్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్’ (USCIRF) తన తాజా నివేదికలో అమెరికా ప్రభుత్వాన్ని కోరింది. ఇండియాలో ద్వైపాక్షిక సంబంధాల్లో ‘మత స్వాతంత్ర్య’ అంశాన్ని కూడా చేర్చాలని సూచించింది. ముఖ్యంగా మైనారిటీలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న నేతలను బహిరంగంగా చీవాట్లు పెట్టేలా భారత్ పై ఒత్తిడి తేవాలని కోరింది. ఆర్ఎస్ఎస్, వీ.హెచ్.పీ తదితర సంస్థలు బలవంతపు మతమార్పిడిలకు పాల్పడుతున్నారని, ఇది ప్రమాదకరమని హెచ్చరించింది. ఈ మేరకు తయారుచేసిన నివేదికను ఆ సంస్థ యూఎస్ ప్రభుత్వానికి అందజేసింది. అయితే.. ఈ సంస్థ ఈ విధంగా అందజేసిన నివేదిక మీద మోదీ సర్కార్ మండిపడటంతోపాటు తనదైన రీతిలో కౌంటర్ ఇచ్చింది.

ఇండియాలో మతస్వేచ్ఛపై ఆ అమెరికన్ సంస్థ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఆక్షేపించిన విదేశాంఖ సంస్థ.. భారత్ మీద అవగాహన లేకపోవడం వల్ల ఇటువంటి నివేదికలు రాస్తారని మండిపడింది. ‘ఇండియా గురించి తెలుసుకున్నది ఇంతేనా?’ అని ప్రశ్నించింది. అసలు ఈ నివేదిక గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని తెలిపింది. ఈ నివేదికను తాము గుర్తించబోమని విదేశాంగ ప్రతినిధి వికాస్ స్వరూప్ కొట్టిపారేశారు. మరి.. ఇండియా ఇచ్చిన ఈ కౌంటర్ పై అమెరికా ఎలా స్పందించనుందో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Narendra Modi  Modi Sarkar  America USCIRF Organisation  India Religion Issues  

Other Articles