Dasari | Coalgate |UPA | Allocations | CBI

Cbi chargesheet against dasari narayan rao naveen jindal madhu koda and 12 others

Dasari,Coal, Coalgate, Coal sacm, UPA, Allocations, Manmohan singh, CBI

The CBI filed a chargesheet against former coal minister Daseri narayan Rao, MP Naveen Jindal, former MoS for Coal Dasari Narayan Rao and former Jharkhand CM Madhu Koda in connection with the 2008 Amarkonda Murgadangal coal block allocation case.

దాసరి చుట్టూ బొగ్గు భగభగలు

Posted: 04/30/2015 09:06 AM IST
Cbi chargesheet against dasari narayan rao naveen jindal madhu koda and 12 others

బొగ్గుశాఖ మాజీ సహాయమంత్రి దాసరి నారాయణరావుకు బొగ్గు కుంభకోణం మసి అంటుకుంది.బొగ్గు క్షేత్రాల కుంభకోణానికి సంబంధించిన ఒక కేసులో సిబిఐ కాంగ్రెస్ నాయకుడు, పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్, కేంద్ర బొగ్గు శాఖ మాజీ సహాయ మంత్రి దాసరి నారాయణరావు, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడా, మరో 12 మందిపై బుధవారం ఇక్కడి ప్రత్యేక కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో వీరే కాకుండా బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి హెచ్ గుప్తా, జిందాల్ స్టీల్ అండ్ పవర్, జిందాల్ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ సహా అయిదు కంపెనీలను కూడా నిందితులుగా పేర్కొన్నారు. 2008లో జార్ఖండ్‌లోని బీర్‌భూమ్ జిల్లాలోని అమర్‌కొండ ముర్గదంగల్ బొగ్గు బ్లాక్ కేటాయింపునకు సంబంధించిన ఈ కేసులో సిబిఐ భారత శిక్షాస్మృతి (ఐపిసి) లోని 120-బి, 420 సెక్షన్లకింద, అలాగే అవినీతి నిరోధక చట్టం కింద ఈ 15 మందిపై అభియోగాలను నమోదు చేసింది. సిబిఐ ప్రత్యేక జడ్జి భరత్ పరాశర్ ముందు ఈ చార్జిషీట్‌ను దాఖలు చేసారు.

సిబిఐ ఇంతకు ముందే బొగ్గు క్షేత్రాల కేటాయింపులకు సంబంధించి దాసరి నారాయణ రావు, నవీన్ జిందాల్ తదితరులపై చీటింగ్, లంచం, మోసపూరిత ప్రవర్తన లాంటి ఆరోపణల కింద కేసు పెట్టిన విషయం తెలిసిందే. 2008లో దాసరి నారాయణ రావు బొగ్గు శాఖ సహాయ మంత్రిగా ఉన్న సమయంలో జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ (జెఎస్‌పిఎల్), జిందాల్ గ్రూపునకే చెందిన మరో సంస్థ గగన్ స్పాంజ్ ఐరన్ ప్రైవేట్ లిమిటెడ్‌లు కలిసి వాస్తవాలను తప్పుగా చూపించడం ద్వారా అమర్‌కొండ ముర్గదంగల్ బొగ్గు క్షేత్రాన్ని దక్కించుకున్నాయన్నది సిబిఐ ప్రధాన ఆరోపణ. ఈ బొగ్గు క్షేత్రాన్ని కేటాయించినందుకుగాను అప్పట్లో 28 రూపాయల విలువున్న దాసరికి చెందిన సౌభాగ్య మీడియాకు చెందిన షేర్లను జిందాల్‌కు చెందిన న్యూఢిల్లీ ఎగ్జిమ్ అనే సంస్థ ఒక్కో షేరును వంద రూపాయల చొప్పున 2.25 కోట్ల రూపాయల పెట్టుబడితో కొనుగోలు చేసిందని, ఇది ఒక విధంగా లంచం ఇవ్వడమేనని కూడా సిబిఐ పేర్కొంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dasari  Coal  Coalgate  Coal sacm  UPA  Allocations  Manmohan singh  CBI  

Other Articles