motkupalli narsimhulu to be appoimted as north-eastern states governor,

Governor post to motkupalli narsimhulu

motkupalli narsimhulu to be appoimted as north-eastern states governor, north-eastern states governor, Tdp leader motkupalli narsimhulu, Trifed chairmen, ramesh rathode

motkupalli narsimhulu to be appoimted as north-eastern states governor and ramesh rathode gets Trifed chairman post

మోత్కుపల్లికి గవర్నర్ పదవి ఖరారు

Posted: 04/26/2015 02:17 PM IST
Governor post to motkupalli narsimhulu

టీటీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులుకు గవర్నర్ పదవి ఖరారైందని సమాచారం. ఆయనను త్వరలోనే ఈశాన్య రాష్ట్రాల్లోని ఒక రాష్ట్రానికి గవర్నర్‌గా నియమించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్రం టీడీపీ అధినేత చంద్రబాబుకు సమాచారమిచ్చినట్లు సమాచారం. మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీలు అటు కేంద్రం, ఇటు ఏపీలో అధికారాన్ని పంచుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీలో బీజేపీ నేతలకు, జాతీయస్థాయిలో టీడీపీ నేతలకు పదవులు ఇవ్వాలని ఆ రెండు పార్టీలు ఒక అవగాహనకు వచ్చాయి.

అందులో భాగంగానే ఈ పదవుల పంపకం జరుగుతోంది. గతంలో ఆయనకు రాజ్యసభ అవకాశం ఇవ్వని చంద్రబాబు.. కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వస్తే గవర్నర్ పదవి ఇప్పిస్తానని హామీనిచ్చారు. ఖాళీగా ఉన్న పలు రాష్ట్రాల గవర్నర్ పదవుల నియామకానికి కేంద్రం కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే మోత్కుపల్లిని గవర్నర్‌గా నియమించనున్నారు.
 
ట్రైఫెడ్ చైర్మన్‌గా రమేష్ రాథోడ్
 
గిరిజన సహకార మా ర్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ నియమితులు కానున్నారు. ఆయనను ట్రైఫెడ్ చైర్మన్‌గా నియమించేందుకు కేంద్రం సమ్మతించింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TDP  Motkupalli Narsimhulu  Governor  Trifed chairmen  ramesh rathode  

Other Articles