Magnitude-6.7 aftershock hits Nepal, tremors felt across India

Fresh earth quake in nepal and delhi

2250 dead in Quake, Hundreds dead in Nepal quake, deadly avalanche on Everest, Nepal official, earthquake, delhi, bihar, gawhathi, Seviour earth quake in nepal people, earthquake, nepal, Dharahara Tower, Bhimsen Tower, disasters-and-accidents, nepal, Buildings collapse in Kathmandu, earthquake rattles Nepal, earthquake rattles Kathmandu, 110 dead in nepal, 10 dead in india

According to the latest figures available with the Home Ministry, over 2,250 people have been killed and 5,654 are injured.

ITEMVIDEOS: నేపాల్ లో మళ్లీ కంపించిన భూమి.. వణికిన ఉత్తర భారతం

Posted: 04/26/2015 01:53 PM IST
Fresh earth quake in nepal and delhi

నిన్నటి భూకంపంతో కాకావికళమైనా భూతల స్వర్గం.. నేపాల్లో మరోసారి భూమి ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో ఇప్పటికే బిక్కుబిక్కుమంటున్న అక్కడి వారంతా మరోసారి తీవ్ర ఆందోళనలో కూరుకుపోయారు. అమెరికా భూగర్భ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఇది సంభవించినట్లు తెలిపారు. మరోపక్క, నేపాల్ లో తాజా ప్రకంపనల అనంతరం భారత రాజధాని ఢిల్లీని కూడా భూప్రకంపనలు చుట్టుముట్టాయి.

ఒక్కసారి భూమి కంపించడంతో ప్రజలంతా భయాందోళనలతో ఇళ్ల బయటకు పరుగులు తీశారు. పలు ఇళ్లలోని వస్తువులు కింద పడిపోయాయి. స్వల్ప విద్యుత్ అంతరాయం కూడా చోటుచేసుకుంది. ఉత్తర భారత మంతా కూడా కంపించిపోయింది. ముఖ్యంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ ప్రాంతాలు కూడా ప్రకంపనల బారిన పడ్డాయి.

కాగా, నేపాల్లో భూకంప మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. పెరుగుతున్న సంఖ్య స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. తాజా నివేదికల ప్రకారం రెండు వేల రెండు వందల యాభై మందికి పైగా మృతదేహాలు లభ్యమైనట్టు సమాచారం. ఒక్క ఖాట్మండులోనే వెయ్యి మందికి పైగా మృతి చెందినట్టు సమాచారం. భూ కంపం ధాటికి సుమారు ఐదు వేల ఏడు వందల మంది క్షతగాత్రులు కాగా, పలువురు సరిస్థితి విషమంగా వున్నట్లు అధికారులు చెప్పారు.  వెన్నులోకి చీల్చుకుని వెళ్తున్న చలిలో వణికిపోతూ వేలమంది ప్రజలు రోడ్లపైనే జాగారం చేశారు. భూకంపం ధాటికి ఎవరెస్టు శిఖరంపై దాదాపు 18 మంది మరణించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nepal quake  tremours  delhi  bihar  rajasthan  

Other Articles