Actress sentenced to life for murder of film director

Kollywood actress gets life for killing film director

Kollywood actress gets life for killing film director, Murder, Court , Actress sentenced to life for murder of film director, news, Kollywood news, Kollywood actress sangeetha, Kollywood actress saritha, Kollywood actress sangitha, Additional Sessions Judge Chandrashekar, Tamil film director M Selva, tamil, murder film director, life imprisonment, actress

A small time actress of Tamil cinema has been sentenced to life imprisonment by a court here on charges of murdering an aspiring film director.

కాల్ షీట్లు ఇవ్వాల్సన నటి.. జీవిత ఖైదుగా కటకటాల్లోకి..

Posted: 04/25/2015 07:45 PM IST
Kollywood actress gets life for killing film director

కాలీవుడ్ కు చెందిన తమిళ సినీనటికి సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. సినిమాల్లో పాత్రల కోసం నటీమణులు ఎంతవరకైనా తెగిస్తారని ఇప్పటికే ప్రేక్షక లోకం నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. చోటుచేసుకున్న ఈ ఘటన అవి నిజమనే భావనను కలిగిస్తోంది. తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ఔత్సాహిక చిత్ర దర్శకుడు ఎం.సెల్వ తన దర్శకత్వంలో 2007లో ఒక చిత్రం నిర్మాణం ప్రారంభించారు. ముందుగా హామి ఇచ్చిన మేరకు తనకు ఆ చిత్రంలో ప్రాధాన్యత గల పాత్ర ఇవ్వలేదని సరిత అలియాస్ సంగీత అనే నటి ఆగ్రహం వ్యక్తం చేసింది.

అంతేకాకుండా అదే సంవత్సరం మార్చి 6న అతనిని ఆమె గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దాంతో పోలీసులు అమెను అరెస్ట్ చేశారు. అయితే ఆ తరువాత ఆమె బెయిల్పై విడుదలై పారిపోయింది. ఏడు సంవత్సరాల వరకు పోలీసులకు దొరకలేదు. ఎట్టకేలకు గత సంవత్సరం డిసెంబరులో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. కేసు విచారణ అనంతరం  నేరం చేసినట్లు రుజువు కావడంతో అదనపు సెషన్స్ జడ్జి చంద్రశేఖర్ ఆమెకు జీవితకాల శిక్ష విధించారు. దాంతో పాటు అయిదువేల రూపాయల జరిమానా కూడా విధించారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : life imprisonment  Saritha alias Sangeetha  M Selva  Tamil Actress  

Other Articles