Hundreds dead in Nepal quake, deadly avalanche on Everest

750 dead in quake nepal official

750 dead in Quake, Hundreds dead in Nepal quake, deadly avalanche on Everest, Nepal official, earthquake, delhi, bihar, gawhathi, Seviour earth quake in nepal people, earthquake, nepal, Dharahara Tower, Bhimsen Tower, disasters-and-accidents, nepal, Buildings collapse in Kathmandu, earthquake rattles Nepal, earthquake rattles Kathmandu, 110 dead in nepal, 10 dead in india

top Nepalese official says at least 688 people have died in the massive earthquake that struck outside Kathmandu on Saturday.

నేపాల్ లో ప్రకృతి ప్రళయం.. 850లకు చేరిన మృతుల సంఖ్య

Posted: 04/25/2015 06:33 PM IST
750 dead in quake nepal official

నేపాల్లో భూకంప మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. పెరుగుతున్న సంఖ్య స్థానికులను భయాందోళనకు గురిచేస్తుండగా, నేపాల్ లో చోటుచేసుకున్న ప్రకృతి విపత్తు నుంచి స్థానికులను ఆదుకునేందుకు ప్రపంచ దేశాలు ముందుకు రావాలని అక్కడి ప్రభుత్వం ఆర్థిస్తోంది. మరణించిన వారి సంఖ్య ఇప్పటి వరకు 850కు చేరినట్ుల నేపాల్ హోం మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి తెలిపారు. అందులో దాదాపు 181 మంది రాజధాని ఖాట్మాండులోనే మృతి చెందారని, మిగతావారు ఫోఖ్రా సహా ఖట్మాండు సరిసర ప్రాంతాలలో మరణించారని అధికారులు వెల్లడించారు. కాగా వారిలో సుమారు 100 మందికి పైగా భారతీయులే వున్నారని కూడా చెప్పారు.

గత 81 ఏళ్లలో నేపాల్లో ఇంటి శక్తివంతమైన ప్రకృతి ఉపద్రవం సంభవించలేదని, ఇదే తొలిసారని కూడా అధికారులు చెబుతున్నారు. ఉదయం 11.56 గంటల సమయంలో 30 సెకన్ల నుంచి రెండు నిమిషాల పాటు మొదటి సారి భూమి కంపించిందని, తరువాత మూడు గంటల వ్యవధిలో 16 సార్లు భూ ప్రకంపనలు వచ్చాయని అధికారులు తెలిపారు. నేపాల్ అధికారులు ప్రకారం 7,9గా రెక్టార్ స్కేలుపై భూకంప తీవ్రత నమోదు కావడంతో నేపాల్ లో ఆస్తి, ఫ్రాణ నష్టం కూడా అంతకంతకూ పెరుగుకుపోతోంది. ఇప్పటికే రాత్రి కావడంతో సహాయక చర్యలకు విఘాతం కలుగక, ప్రతికూల వాతావరణం కూడా సహాయక చర్యలకు విఘాతం కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో రేపటికి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం వుందని అధికారులు భావిస్తున్నారు. వేలాది మంది క్షతగ్రాతులలో పలువురి పరిస్థితు కూడా ఆందోళనకరంగానే వుందని అధికారులు చెప్పారు.

కాగా, భూకంపం ప్రభావం ఉత్తర భారతదేశం మీద కూడా తీవ్రంగానే కనిపించింది. బీహార్లో 20 మంది, ఉత్తరప్రదేశ్లో 8 మంది భూకంపం కారణంగా మరణించారు. బీహార్లోఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు గోడకూలి మరణించారు. ఉత్తర బీహార్లోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలు ఇళ్ల గోడలకు బీటలు వారాయి. మరో 48 మంది తీవ్రంగా గాయపడ్డారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కూడా ముగ్గురు మరణించారు. మాల్డాలోని ఓ స్కూలు భవనం కుప్పకూలి పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : earthquake  Nepal earthquake  death toll  

Other Articles