నేపాల్ రాజధాని ఖట్మాండుకు 83 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమై సంభవించిన భూకంపం నేపాల్, సహా భారత్ ఈశాన్య, ఉత్తర రాష్ట్రలలో ప్రాణ, అస్తి నష్టాన్ని మిగిల్సించింది. నేపాల్ రాజధాని ఖట్మాండు సహా అనేక ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. ఇప్పటివరకూ అందిన వివరాల ప్రకారం 110 మంది మరణించగా, క్షతగాత్రుల సంఖ్య వేల మందికి పైగానే వుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. అనేక ప్రాంతాల్లో శిధిలమైన భవనాల కింద బాధితులు వున్నట్లు సమాచారం.
భూప్రకంపనలతో నేపాల్లోని పురాతన భవనాలు, ఆలయాలు, చారిత్రక కట్టడాలతో పాటు గృహ సముదాయాలు, కార్యాలయాలు కుప్పకూలాయి. నేపాల్ లాంజంగ్ ప్రాంతంలో భూప్రకంపనలు అధికంగా నమోదు అయ్యాయి. చాలా ప్రాంతాల్లో రహదారులు ధ్వంసం అయ్యాయి. మరోవైపు గాయపడినవారు పెద్ద ఎత్తున ఖాట్మాండ్లోని ఆస్పత్రులకు తరలి వస్తున్నారు. ఇంకా చాలా మంది ప్రజలు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. పాత ఖాట్మాండ్లోని హన్మాన్ డోక ప్రాంతంలో భూకంప ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. భూ ప్రకంపనల ధాటికి ఖాట్మండు విమానాశ్రయాన్ని మూసివేశారు. దుమ్ముధూళితో ఖాట్మాండ్ నిండిపోయింది. అలాగే నేపాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థపై కూడా ప్రభావం చూపింది. టెలికమ్ సేవలు నిలిచిపోయాయి. నేపాల్ సరిహద్దు రాష్ట్రాల్లో భూకంప ప్రభావం తీవ్రమని అధికారులు అంచనా వేస్తున్నారు. నేపాల్ రాజధాని ఖట్మాండు పరిసర ప్రాంతాల్లో ఎటూ చేసినా బీతావహ పరిస్థితులు అలుముకున్నాయి. క్షతగాత్రులను ఓదార్చుతున్న పెద్దలు, తమ వారి కోసం వెతుకుతున్న మరికోందరు. తమ వారు మృతి చెంది ఇంకోందరు అర్తానాధాలు పెడుతుండటంతో విషాధ వాతావరణం అలుముకుంది.
బీహార్, ఉత్తర్ ప్రదేశ్ లలో 10 మంది మృతి
ఇటు భూకంపం ఉత్తర, ఈశాన్య భారతదేశాన్ని వణికించింది. ఇవాళ సంభవించిన భూప్రకంపనల వల్ల బీహార్లో ఐదుగురు, ఉత్తరప్రదేశ్లో ఐదుగురు మరణించారు. బీహార్లోని భగల్పూర్ గోడ కూలిపోవడంతో ఇకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. సీతామాడి, డర్భంగా, వైశాలిలో భవనాలు కూలిపోవడంతో ముగ్గురు మరణించారు. బీహార్లో చాలా చోట్ల భూప్రకంపనల ధాటికి ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. ఆస్తి నష్టం ఏమేరకు సంభవించిదన్న విషయం ఇంకా తెలియరాలేదు. యూపీలో భూప్రకంపనల వల్ల ఐదుగురు మరణించినట్టు సమాచారం. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా భూప్రకంపనలు సంభవించగా, ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్టు సమాచారం లేదు.
భారత ప్రభుత్వం నేపాల్కు సహాయక బృందాలను పంపుతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం 3 గంటలకు ఉన్నతాధికారులతో అత్యవసరంగా సమావేశమయ్యారు. ఉత్తర, ఈశాన్య భారతంలో సంభవించిన భూకంపం ప్రమాదాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. భూకంప తీవ్రతపై అధికారుల నుంచి సమాచారం సేకరిస్తున్నామన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ట్వీట్ చేశారు. నేపాల్లో భూంకంప పరిస్థితిని కూడా గమనిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. యూపీ, బీహార్, నేపాల్లో సంభవించిన భూకంపాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ విపత్తు నివారణ సంస్థను అడిగి వివరాలు తెలుసుకున్నారు. భూకంప తీవ్రతపై అధికారులతో చర్చించారు. భూకంపం ఉత్తర, ఈశాన్య భారతదేశాన్ని వణికించింది. భూప్రకంపనల వల్ల బీహార్లో ఐదుగురు, ఉత్తరప్రదేశ్లో ఐదుగురు మరణించారు. పశ్చమబెంగాల్లో మరొకరు చనిపోయారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more