KCR | TRS | President | Unanimously

Kcr will become trs party president unanimously

kcr, trs, plenary, president, nayini narasimha reddy, kadium, unanimously

KCR will become TRS party president unanimously. THe TRS party lead by the kcr since party establishment time. Kadium srihari proposed kcr as trs president and some more ministers suppoted that.

గుళాబీ దళపతి కెసీఆరే.. ఏకగ్రీవం.. ప్రకటనే తరువాయి

Posted: 04/21/2015 08:44 AM IST
Kcr will become trs party president unanimously

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టిఆర్‌ఎస్ అధ్యక్ష పదవి కోసం నామినేషన్లు దాఖలు చేయడానికి సోమవారం మధ్యాహ్నం మూడు గంటల వరకు గడువు ఉండగా, కెసిఆర్ నామినేషన్ మాత్రమే దాఖలైంది. కెసిఆర్ పేరును ప్రతిపాదిస్తూ ఎన్నికల అధికారి నాయిని నర్సింహారెడ్డికి ఆరుసెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కెసిఆర్ పేరు ప్రతిపాదించగా, మంత్రులు మద్దతు తెలిపారు. ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, మహేందర్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి కెసిఆర్ పేరును ప్రతిపాదిస్తూ నామినేషన్ అందజేశారు. శాసన సభాపక్షం తరఫున సోమారపు సత్యనారాయణ ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. జడ్‌పి చైర్మన్ల తరఫున తుల ఉమ, సునీతా మహేందర్‌రెడ్డి తదితరులు మరో నామినేషన్ సెట్‌ను అందజేశారు. పార్లమెంటరీ పార్టీ తరఫున బల్క సుమన్ కెసిఆర్ పేరు ప్రతిపాదిస్తూ నామినేషన్ దాఖలు చేశారు. ఒక్క కెసిఆర్ పేరును మాత్రమే ప్రతిపాదిస్తూ నామినేషన్లు దాఖలు అయినట్టు నాయిని తెలిపారు. దీంతో కెసిఆర్ ఎన్నిక ఏకగ్రీవమైంది. అయితే నిబంధనల మేరకు నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ వంటి కార్యక్రమాలను లాంఛనంగా పూర్తి చేసిన తర్వాత 23న కెసిఆర్ ఎన్నికను అధికారికంగా ప్రకటిస్తారు. కెసిఆర్ పేరును ప్రతిపాదిస్తూ అన్ని వర్గాల నుంచి నామినేషన్లు దాఖలు అయ్యేట్టుగా చర్యలు తీసుకున్నారు. దళిత వర్గం నుంచి కడియం శ్రీహరి ప్రతిపాదించగా, మైనారిటీ, బిసి, ఎస్సీ, రెడ్డి వర్గాల నుంచి కూడా నామినేషన్లు దాఖలు అయ్యేట్టుగా చూశారు. టిఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి కెసిఆర్ పార్టీకి అధ్యక్షునిగా కొనసాగుతూ వస్తున్నారు.

టిఆర్ఎస్ అధ్యక్షుడి ఎన్నిక ఎలాగూ ఏకగ్రీవం అవుతుంది అని అందరికి తెలుసు.. కానీ టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఎవరిని వరిస్తుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కెసిఆర్ తనయుడు కెటిఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అవుతారని ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. మరి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎవరు అవుతారో చూడాలి. టిఆర్‌ఎస్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటారని జరుగుతున్న ప్రచారం గురించి నాయిని నరసింహారెడ్డిని ప్రశ్నించగా, అది అధ్యక్షుని ఇష్టం అని అన్నారు. సంస్థాగత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని, 50లక్షల సభ్యత్వం దాటిందని, పార్టీసభ్యులందరికీ బీమా చేయించనున్నట్టు తెలిపారు. కూకట్‌పల్లి, మల్కాజిగిరి వంటి ప్రాంతాల్లో నివసించే ఆంధ్ర ప్రాంతంవారు పెద్ద యెత్తున పార్టీలో చేరారని నాయిని తెలిపారు.

**అభినవచారి**

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kcr  trs  plenary  president  nayini narasimha reddy  kadium  unanimously  

Other Articles