Congress | Rahulgandhi | NDA | Land

Congress vice president rahulagandhi fire on nda govt and modi sakar

congress, rahul gandhi, parliament, landpooling, landacquisiation

Congress vice president rahulagandhi fire on nda govt and modi sakar. He slamed modi policy and landpooling bill. He oppose the landpooling bill on antifarmers policy.

వామ్మో.. వాయ్యో.. రాహుల్ అదరగొట్టారు బాబోయ్

Posted: 04/21/2015 08:04 AM IST
Congress vice president rahulagandhi fire on nda govt and modi sakar

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్లమెంట్ లో తన మాటల తూటాలు పేల్చారు. లాంగ్ లీవ్ తర్వాత తిరిగి వచ్చిన రాహుల్ గాంధీ ఫుల్ రీఛార్జ్ అయినట్లున్నారు. ఎన్డీయే రైతుల ప్రభుత్వం కాదని, సూటు బూటు ప్రభుత్వమని, పెట్టుబడి దారులు, ధనికులకు అనుకూలమైన ప్రభుత్వమని కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైతుల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరును లోక్‌సభలో ఆయన తూర్పారబట్టారు. సోమవారం నాడు పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమైన అనంతరం కేంద్ర ప్రభుత్వం భూసేకరణ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. దీనిపై చర్చ సందర్భంగా రాహుల్‌ గాంధీ ప్రసంగిస్తూ తనదైన శైలిలో మోదీ సర్కార్‌పై ఘాటైన విమర్శనాస్ర్తాలు సంధించారు.

ఎన్డీయే ప్రభుత్వం తీసుకువచ్చిన భూసేకరణ బిల్లుతో రైతులకు తీవ్ర నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. యూపీఏ హయాంలో వ్యవసాయం అభివృద్ధి సాధించిందని, తమ హయాంలో అనేక పంటలకు మద్దతు ధర పెంచామని రాహుల్‌ గుర్తుచేశారు. అభివృద్ధి నినాదంతో అందలమెక్కిన ఎన్డీయే ప్రభుత్వం సాధించిందేమీ లేదని దుయ్యబట్టారు. ‘అచ్ఛే దిన్‌’ అనేది ఒక విఫల ప్రయోగమని వ్యాఖ్యానించారు. రైతులకు మద్దతు ధర కల్పించడంలో మోదీ సర్కార్‌ విఫలమైందని ధ్వజమెత్తారు. మోదీ పాలనలో వ్యవసాయాభివృద్ధి స్తంభించిపోతోందని, ఇప్పటి వరకు 1 శాతం మాత్రమే వృద్ధి రేటు నమోదైందని ఆరోపించారు. అదే యూపీఏ హయాంలో వ్యవసాయాభివృద్ధి 4.2 శాతంగా ఉందని గుర్తుచేశారు.

పంట నష్టాలపై ప్రభుత్వం ప్రజలను గందరగోళానికి గురిచేస్తోందని రాహుల్‌ గాంధీ మోదీ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు మద్దతు ధర అడిగితే పోలీసులు లాఠీలకు పనిచెప్తున్నారని, ఈ కారణంగానే మోదీని రైతులు విశ్వసించడం లేదన్నారు. రైతుల కడగండ్లను ప్రధానమంత్రి నేరుగా పరిశీలించాలని రాహుల్‌ సూచించారు. కాగా రాహుల్‌ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు పాలకపక్షం నేతలు ప్రయత్నించగా వారికీ చురకలంటించారు. నిజాలు నిష్ఠురంగానే ఉంటాయని, ఓపిగ్గా వినాలని రాహుల్‌ హితవుపలికారు. మొత్తానికి రాహుల్ గాంధీ పార్లమెంట్ సమావేశాల్లో తన మాటలతో బాగానే ఊపేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : congress  rahul gandhi  parliament  landpooling  landacquisiation  

Other Articles