indo american gays marriage photos goes viral in social media

Sandeep weds karthik an unusual love story

sandeep weds karthik an unusual love story, indo american gays marriage photos goes viral in social media, indo american gays, malayalam gays marriage, sandeep weds karthik, gays marriage photos goes viral in social media

indo american gays sandeep weds karthik marriage photos goes viral in social media

విదేశంలో స్వదేశీయుల స్వలింగ కళ్యాణం.. నెట్ లో హల్ చల్..

Posted: 04/17/2015 08:04 PM IST
Sandeep weds karthik an unusual love story

'పెళ్లంటే- పందిళ్లు, సందళ్లు తప్పట్లు, తాళాలు తలంబ్రాలు.. మూడే ముళ్లు ఏడే అడుగులు.. మొత్తం కలిపి నూరే'ళ్లు.. అంటూ త్రిశూలం చిత్రంలోని పాటలను అలపిస్తుంటారు యువకులు. తమ జీవితంలోకి తనను కొత్త వ్యక్తి వస్తుందని, అప్పటి వరకు దాచుకున్న అంబరమంత ప్రేమను కుమ్మరించేందుకు సిద్దంగా వుంటారు. అయితే అచ్చం అలానే జరిగింది కానీ.. యువకుడి జీవింతోకి మరో కోత్త వ్యక్తి వచ్చి చేరింది. అయితే.. చేరిన వ్యక్తి కూడా మగ కావడమే ఇక్కడ విచిత్రం. సప్త సముద్రాల అవతల స్వలింగ సంపర్కులు పెళ్లిళ్లు చేసుకుంటున్నారని వార్తల్లో విన్నాం కానీ.. మన దేశంలోనూ ఇలాంటి విచిత్రాలు జరిగితే నిజంగా విడ్డూరమే.

సందీప్, కార్తీక్. భారతీయ అమెరికన్లయిన వీరు స్వలింగ సంపర్కులు సంప్రదాయ బద్దంగా పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు.. అలా అని వీరిది ఆషామాషీ పెళ్లికాదు. బోలెడంత ప్రత్యేకత ఉంది. తిరువనంతపురంలో పుట్టి అమెరికాలో సెటిలై న సందీప్‌కు అమెరికాలో పుట్టిన కార్తీక్‌తో 2012లో ఓ డేటింగ్ వెబ్‌సైట్‌లో పరిచయమైంది. ప్రేమపక్షులు ఒకరికొకరు తెగ నచ్చేశారు. పరిచయం ముదిరి ప్రేమగా మారింది. పెళ్లిబంధంతో ఒకటి కావాలనుకున్నారు. 2013లో తమ తల్లిదండ్రులకు సంగతి చెప్పి అనుమతి కోరారు. తల్లిదండ్రులు తొలుత షాక్ తిన్నా తర్వాత విశాల హృదయంతో ఒప్పేసుకున్నారు. ఇంకేం అబ్బాయిలు ఎగిరి గంతేశారు. పెళ్లిని అంగరంగవైభోగంగా, అగ్నిసాక్షిగా పక్కా మలయాళీ సంప్రదాయం ప్రకారం జరుపుకోవాలని అనుకున్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో నిశ్చితార్థం చేసుకున్నారు.

తర్వాత పెళ్లి ఏర్పాట్లు మొదలెట్టారు. సిగ్గుపడకుండా బంధుమిత్రుల ఇళ్లకెళ్లి ‘మా పెళ్లికి సకుటుంబసమేతంగా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించండి’ అంటూ ఆహ్వాన పత్రికలు పంచారు. ఈ ఏడాది జనవరి 18న శుభముహూర్తంలో కాలిఫోర్నియాలో పెళ్లిపీటలెక్కారు. పురోహితుడు వేదమంత్రాలు పఠిస్తుండగా, బంధుమిత్రులు అక్షింతలు చల్లుతుండగా కార్తీక్.. సందీప్ మెడలో తాళి కట్టాడు. తర్వాత అగ్నిగుండం చుట్టూ ఏడడుగులు నడిచారు. వరుడు తన అర్ధాంగుడి చేయిపట్టుకుని అరుంధతీ నక్షత్రం చూపించాడు. ఆహూతులు కొత్తజంటకు కానుకలు సమర్పించి ఎవరికి తోచినట్లు వారు ఆశీర్వదించారు. కొబ్బరి దండిగా చేర్చి వండిన కమ్మని కేరళ వంటకాలతో ఆహూతులు భోంచేశారు. వీరి పెళ్లి సంగతి ఇటీవల సోషల్ మీడియాలో బయటకొచ్చి, గేలకు నూతనోత్తేజం ఇస్తోంది. అయితే మరో వర్గం వారు మాత్రం ఇదో వింత పరిణామం అనుకుంటూ చెవులు కోరుకుంటున్నారు.
 

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sandeep  Karthik  Gays  photos  viral  social media  

Other Articles