cpi narayana demands special status ap | venkaiah naidu updates

Cpi narayana controversial comments venkaiah naidu ap special status

cpi narayana updates, venkaiah naidu news, congress party controversies, polavaram project news, bjp party updates, ap special status, bjp party controversy, narendra modi updates

cpi narayana controversial comments venkaiah naidu ap special status : cpi narayana makes another time controversial comments on venkaiah naidu in the issue of ap special status

మండలాల మార్పిడి చేయొచ్చుగానీ.. స్పెషల్ స్టేటస్ పెట్టలేరా?

Posted: 04/17/2015 08:23 PM IST
Cpi narayana controversial comments venkaiah naidu ap special status

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంకా విభజన కాకముందు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ పార్టీ ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని ఢంకా బజాయించి చెప్పిన విషయం తెలిసిందే! అలాగే.. కాంగ్రెస్ అప్పుడు పునర్విభజన బిల్లులో ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని పెట్టిన సంగతి విదితమే! దీంతో ఏపీకి స్పెషల్ స్టేటస్ వస్తుందని, బీజేపీ అధికారంలోకి రాగానే దానిని ప్రశేశపెడుతుందని అంతా భావించారు కానీ.. అటువంటిదేమీ జరగలేదు. తాము అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పునర్విభజన బిల్లు పెట్టిన ప్రత్యేక హోదా ఏపీకి ఖచ్చితంగా కల్పిస్తామని చివరాఖరికి మొండిచెయ్యే చూపించింది. దీంతో బీజేపీ పార్టీ, నేతల మీద ఇప్పటికీ తీవ్ర విమర్శలు వస్తూనే వున్నాయి.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా తెలంగాణాలోని ఏడు మండలాలను ఆంధ్రాలో కలపాల్సిందేనన్న అంశంపై నెగ్గిన బీజేపీ పార్టీ.. ప్రత్యేక హోదా ఎందుకు ప్రవేశపెట్టడం లేదంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. గెలవకముందు ఓమాట, గెలిచిన తర్వాత మరోమాట చెప్పడం ఎంతమాత్రం సమంజసమని బీజేపీ పార్టీని నిలదీసినప్పటికీ.. దీనిపై సమాధానం ఇవ్వడం లేదు. కాంగ్రెస్ పార్టీ చేసిన స్కామ్స్, ఇతర తప్పిదాల కారణంగా భారత్ లో ఆర్థిక విలువలు చాలా తగ్గాయని బీజేపీ చెబుతోంది తప్ప.. ఈ ప్రత్యేక హోదాలపై ఏదైనా పరిష్కారమార్గాన్ని ఇంతవరకు తెలుపలేకపోతోంది. ఇక ఈ హోదాను సాధించడంలో వెంకయ్యనాయుడు కూడా విఫలమయ్యారని ఆయనమీద విమర్శలు వస్తున్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ మరోసారి వెంకయ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులో నారాయణ మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదాను పునర్విభజన బిల్లులో కాంగ్రెస్ పార్టీ పెట్టలేదని పదేపదే వెంకయ్య చెప్పడం ఎంతో హాస్యాస్పదంగా వుందని అన్నారు. ‘కాంగ్రెస్ పార్టీ ఆ బిల్లులో పెట్టలేదు సరే.. అధికారంలో వున్నది ఎన్డీయే ప్రభుత్వమే కదా? లోక్ సభలో పూర్తి మెజారిటీ వుంది కదా? దేశంలోనీ పార్టీలన్నీ విభజనకు మద్దతిచ్చాయి కదా? సాక్షాత్తూ ప్రధాని రాజ్యసభలో ప్రకటన చేశారు కదా? అలాంటప్పుడు ఎన్డీయే ప్రత్యేక హోదా ఎందుకివ్వకూడదు’ అని వెంకయ్యను ఆయన నిలదీశారు. ‘పోనీ.. విభజన చట్టలో ప్రత్యేక హోదా లేనప్పుడు ప్రధాని ప్రకటిస్తే బీజేపీ ఎందుకు అంగీకరించింది?’ అని ఆయన సూటిగా ప్రశ్నించారు.

గెలవకముందు ఓమాట.. గెలిచిన తర్వాత మరోమాట.. ఇలా అధికార పార్టీ నేతలు మాట్లాడే రెండు నాల్కల ధోరణి ముందు అరికట్టాలని ఆయన సూచించారు. ప్రత్యేక హోదాపై ఉద్యమం చేసేందుకు సహకరించాలని అందరికీ పిలుపునిచ్చారు. అలాగే భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా మే 14న ఆందోళన చేపట్టనున్నామని ఆయన వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : cpi narayana  venkaiah naidu  ap special status  narendra modi  

Other Articles